తెలుగు రాష్ట్రాల్లో చిన్న పెద్దా అంతా కలిపి అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి... సంక్రాంతి వచ్చేసింది.. ఇంకేముంది సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా జరుపుకుంటున్నారు. తెలుగు ప్రజలందరూ సాంప్రదాయంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి మొదటిది. సంవత్సరం ప్రారంభంలోనే వచ్చే మొదటి పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో  అంబరాన్నంటాయి. సంక్రాంతి పండుగలో భాగంగా ఈ రోజు భోగి పండుగ జరుపుకుంటున్నాయి  తెలుగు రాష్ట్రాలు. 

 

 

 ఏ పండుగైనా సొంతూళ్లకు వెళ్తారో లేదో  కానీ సంక్రాంతి పండుగ వచ్చిందంటే వ్యాపారాలు ఉద్యోగాలు నిమిత్తం  ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు  సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు చేరుకుంటారు. కుటుంబసభ్యులు బంధువుల మధ్య సంక్రాంతి పండుగను జరుపుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతానికి వెళ్లిన వారు ఎక్కువే కదా. సంక్రాంతికి ఇప్పటికే అందరూ సొంతూళ్లకు చేరుకున్నారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... సంక్రాంతి దోపిడి మాత్రం ఫుల్లుగా జరిగిపోయింది. సంక్రాంతి దోపిడీ ఏంటి అంటారా... ఇన్ని రోజులు దొంగలు ఇంట్లో చొరబడి అందినకాడికి దోచుకుని దోపిడీ చేయడం చూశాం... సైబర్ నేరగాళ్లు అకౌంట్ హ్యాక్ చేసి డబ్బులు కాజేసి దోపిడీ చేయడం చూస్తాం... కానీ సంక్రాంతి దోపిడి అంటే ఒక ఊరి నుంచి ఒక ఊరికి రావడం ప్రయాణాలు ఎంత భారంగా మారిందో ప్రస్తుతం తెలిసిన విషయమే.

 

 

 ఒకప్పుడు దూరప్రయాణాలు మాత్రమే అధిక ఛార్జీలతో భారంగా మారాయి. ఇప్పుడు లోకల్ ప్రయాణాలు కూడా అంతే భారంగా మారి పోయాయి. స్థానికంగా ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను ఛార్జీలు ఒక్కసారిగా పెంచడం అటు ఆర్టీసీ బస్సుల యాజమాన్యాలు కూడా చార్జీలు పెంచుతూ ఉండటం... పండుగ సమయంలో లోకల్ లో ప్రయాణించాలి అన్న ఆటోలు టాక్సీలు లభించే పరిస్థితి లేకపోవడంతో... ఉన్న కొన్ని ఆటోలు భారి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి.దీంతో  భారీ ఛార్జీలు చెల్లించక తప్పటంలేదు. ఏంటి ఈ అధిక చార్జీలు అని లోకల్ ఆటో టాక్స్ లను ప్రశ్నిస్తే మాత్రం... ఏం సార్.. మేము  పండగ వదిలేసుకుని మీకోసం వస్తే మీరు ఆ  మాత్రం చెల్లించ లేరా అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టేస్తారు. ఏమైనా దోపిడీలో లోకల్ దోపిడీ వేరయ్య అంటున్నారు జనాలు .

మరింత సమాచారం తెలుసుకోండి: