తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఈ పండుగ రోజుల్లో తెలుగు లోగిళ్ళు కొత్త అల్లుళ్ళ తోను.. బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర సంక్రమణం జరిగింది కనుక దీ నిని మనం మకర సంక్రాంతి అని పిలుచుకుంటాం.  మనకు చాలా పండగలు ఉన్నప్పటికీ.. వాటిలో ‘సంక్రాంతి’ మాత్రం చాలా ప్రత్యేకం.ఏడాదిలో వచ్చే తెలుగు దనపు తొలిపండుగ.  అన్ని పండుగలలో కెల్లా ఇది పెద్ద పండగ.  భోగి, సంక్రాంతి, కనుమ పేరుతో.. మూడు రోజులపాటు ఈ పండగను జరుపుకుంటారు.

 

దీ నిని ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ ,కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అని తమిళనాడులో పొంగల్ ,పంజాబ్ లో లోహిరి రాజస్థాన్ ,గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరయన్ అని పిలుస్తారు. ఇక సంక్రాంతి వస్తోందంటే బుల్లితెర కూడా సందడిగా మారుతుంది. సంక్రాంతి వినోదాలు వెదజల్లుతుంది. ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాల కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. మరి ఈ వినోదాలకు తోడుగా ఓ సూపర్‌హిట్‌ ‘బొమ్మ’ బుల్లితెరపై పడితే ఆ కిక్కేవేరు కదూ. 

 

సాధార‌ణంగా ఇళ్ల‌లో టీవీ చానెళ్లు కూడా సంక్రాంతికి డిఫ‌రెంట్‌గా ముస్తాబ‌వుతున్నాయి. కోట్ల‌కు కోట్లు పెట్టుబ‌డులు పెట్టి షోలు చేస్తున్నాయి. ఇది ప్ర‌జ‌ల‌కు సంతోషం పంచుతుండ‌గా.. మ‌రోప‌క్క‌, న‌టుల‌కు ల‌క్ష‌ల ఆదాయాన్ని కురిపిస్తోంది. చాలా మందికి ఇంట్లోని బుల్లి తెరే పెద్ద సంక్రాంతిని పంచుతోంది. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి సరికొత్త వినోదాలతో సిద్ధమవుతున్నాయి. సంక్రాంతి అంటే పల్లెటూళ్లే కళ్ల ముందు కదులుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: