తెలుగు రాష్ట్రాల్లో చిన్నాపెద్ద అంతా సందడి చేస్తూ అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. సాంప్రదాయానికి నిలువుటద్దంల ఉండే  ఈ పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో నిష్టగా జరుపుకుంటూ ఉంటారు. ఉద్యోగాల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సంక్రాంతి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సొంతూళ్లకు చేరుకుంటారు.  మూడురోజులపాటు జరిగే సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ అంబరాన్ని అంటేలా జరుపుకుంటారు. ఇక సంవత్సరం ప్రారంభంలో మొదట వచ్చే పండుగ కావడంతో ఈ పండుగ ఎంతో విశిష్టతను సంతరించుకుంటుంది. సంక్రాంతి పండుగ అంటే సాంప్రదాయానికి నిలువుటద్దంల మారిపోతుంది. సాంప్రదాయమైన వస్త్రాలు సాంప్రదాయమైన అలవాట్లు ఇలా పూర్తిగా సాంప్రదాయ మయం అయిపోతుంది. 

 

 

 అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే గొబ్బెమ్మలు రంగురంగుల రంగవల్లులు సాంప్రదాయమైన వస్త్రాలు గంగిరెద్దుల ఆటలు హరిదాసుల కీర్తనలు... ఇవన్నీ లేకపోతే సంక్రాంతి సంక్రాంతి పండుగ లాగానే ఉండదు అంటే అతిశయోక్తి కాదు.అయితే  సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇవన్నీ ఉండటంతో పాటు కోడి పందాలు కూడా ఉండాల్సిందే. కోడి పందాలు లేకపోతే సంక్రాంతి మజా ఎక్కడ ఉంది అంటున్నారు ఆంధ్ర ప్రజలు. ఆంధ్ర ప్రజలు అందరు కోడి పందాల నిర్వహించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక కోడి పందాల్లో  తమ పుంజులను బరిలోకి దింపే వాళ్ళు కొన్ని నెలల నుంచి పుంజులను కోడి పందాల కోసం సిద్ధం చేస్తూ ఉంటారు. ఎలాగైనా పందెం గెలవాలని ఆతృతతో ఉంటారు. 

 

 

 అయితే నిత్యం రాజకీయాల్లో కొట్టుకునే రాజకీయ నాయకులు కూడా ఒక దగ్గర చేరిపోతారు. అవును ! రాజకీయాల్లో నిత్యం కొట్టుకొని తిట్టుకొని నాయకులు అదేంటోగాని సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు... భుజాలపై చేతులు వేసుకుని మరీ కోడిపందాలు బరిలోకి దిగుతుంటారు . రాజకీయాల్లో బద్ద శత్రువులు అయినప్పటికీ సంక్రాంతి నాడు మాత్రం విడదీయరాని మిత్రులుగా మారిపోతారు. ఆ సమయంలో వారికి పార్టీలతో పనిలేదు.. ముఖ్యంగా ఉభయ గోదావరి  జిల్లాలో పార్టీలకు అతీతంగా నాయకులు కోడిపందాల్లో మునిగిపోతున్నారు. పందాల కాడ పార్టీ లేంటి  గురు అనుకుంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: