పండ‌గ‌ల‌న్నిటిలో సంక్రాంతి అంటేనే ఓ ప్ర‌త్యేక పండ‌గ‌గా ప‌రిగ‌ణిస్తారు హిందువులు. అందులోనూ గోదావ‌రి జిల్లాలో ఈ పండ‌గ సంద‌డి మాములుగా ఉండ‌దు. ఇక్క‌డ జ‌రిగిన‌ట్టు సంక్రాంతి మ‌రెక్క‌డా జ‌ర‌గ‌దు. అస‌లు సంక్రాంతి పండ‌గంటేనే గోదారి జిల్లాలో హ‌డావిడి అంతా ఉంటుంది. కోడిపందాలు, ఎడ్ల పందాలు, హ‌రిదాసుల హ‌డావిడి, పేరంటాల ముగ్గులు, ముచ్చ‌ట్లు, పిండివంట‌ల ఘుమ ఘుమ‌లు, గొబ్బెమ్మ‌లు, లంగాఓణాలు ఒక్క‌టికాదు ఈ పండ‌గ ప్ర‌త్యేక‌త చెప్పుకోవాలే గాని అస‌లు ఎంత చెప్పుకున్నా త‌క్కువ‌గానే క‌నిపిస్త‌ది.


ఇక‌పోతే ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయ ప‌రిస్తితులు స‌రిగాలేని విష‌యం తెలిసిందే.  రైతుల  భూముల గొడ‌వ‌లు జ‌రుగుతున్న హ‌డావిడి గురించి తెలిసిందే. ఆల్రెడీ ఆ గొడ‌వ‌ల‌తో రాష్ట్ర‌మంతా అట్టుడికిపోతుంది. అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలో  ప‌రిస్థితి ఎలా ఉన్నా.. గోదావ‌రి జిల్లాల్లో మాత్రం సంక్రాంతి సంబ‌రాలు య‌ధాప్ర‌కారం జ‌ర‌గ‌తున్నాయి. ఇప్ప‌టికే పందెం కోళ్ల బ‌రులు రెడీ అయ్యాయి. ఎడ్ల‌పందాలు, పిండివంట‌లు వండేస్తున్నారు. ఇక వీధి వీధికి భోగి మంట‌లు వేసి చ‌లికాచుకుంటున్నారు. గోదావ‌రి జిల్ల‌లోపండ‌గంటే ఆ సంద‌డే వేరు. అన్న‌ట్లు ఉంది ఇక్క‌డ పండ‌గ వాతావ‌ర‌ణం అంతా.


పండ‌గ హ‌డావిడి  అంతా ఈ మూడు రోజులు ఎక్కువగా గోదావ‌రి జిల్లాలోనే క‌న‌ప‌డుతుంది. దూరం ఊళ్ళ‌లో ఉండేవారంతా కొంత మంది ముందుగానే ఊరు వెళ్ళిపోతే మ‌రి కొంత మంది భోగిరోజునైనా అక్క‌డ ఉండాల‌ని ఆరోజు ఉద‌యం ఏది వీలుగా ఉంటే దానిపైన ప్ర‌యాణించి ఊళ్ళ‌కు చేరుకుంటారు. ఊళ్ల‌లో ఉండే ప్రేమ ఆప్యాయ‌త‌లు ఎంతైనా వేరుక‌దా అందులోనూ గోదారి జిల్లాల వారి మ‌ర్యాద‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలా.

మరింత సమాచారం తెలుసుకోండి: