సంక్రాంతి పండుగ అంటే తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన పండుగ. అలాంటి ఈ సంక్రాంతి సమయంలో అందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునే  భోగి.  భోగి ముందు రోజు నుంచే భోగి మంటకోసం పెద్ద పెద్ద దుంగలు వెతికి మరీ ఊరికి మధ్యలో ముగ్గులు వేసి వాటిలో మంటలు పెడుతారు. ఆ మంటల్లోనే నీళ్ళు కాచుకుంటారు. అన్నం వండుతారు, ఆ తరువాత వారి వారి ఇళ్ళలో చిన్న పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి ముందు నుంచీ ఏర్పాట్లు చేస్తారు. కొంతమందైతే తమ పిల్లలకోసం తామే రేగి చెట్ల వద్దకి వెళ్లి రేగిపళ్ళు ( భోగి పళ్ళు )  వెతికి సేకరించి తెస్తారు. చుట్టుపక్కల అందరిని సాయంత్రం మా ఇంట్లో భోగిపళ్లు పోస్తున్నాం అంటూ పిలుపులు పిలుస్తారు. భోగిపళ్లు, పూలు, చిల్లర అన్నిటిని కలిపి పిల్లల తలపై భోగి పళ్ళు పోస్తారు.

Related image

ఈ భోగి పళ్ళు ఎందుకు పోస్తారు..?? వీటిని పిల్లలకి మాత్రమే, అందులోనూ తలపైనే  ఎందుకు పోస్తారు..?? అనే విషయం చాలా మందికి తెలియదు. అసలు పిల్లలకి ఈ పళ్ళు తలపైనే ఎందుకు పోస్తారంటే. అందుకు కారణం లేకపోలేదు అంటున్నారు పండితులు. చిన్న పిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉండటానికి ఇలా భోగి పళ్ళు పోస్తారట. శ్రీ మహా విష్ణువు కి రేగి చెట్టు పళ్ళు అంటే ఎంతో ఇష్టం.. రేగి పళ్ళని బదరీ ఫలాలు అని కూడా అంటారు అందుకే విష్ణువు ని బదరీ నారాయణుడు అని కూడా పిలుస్తారు. విష్ణువు కి ఎంతో ఇష్టమైన ఈ పళ్ళని పిల్లలకి తలమీదుగా పోయడం వలన విష్ణువు పిల్లలని కరుణిస్తాడుని ప్రతీతి.

Related image

అంతేకాదు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి విష్ణువు ఘోరతపస్సు చేశాడని, ఆ సమయంలో దేవతలు రేగిపళ్ళ ని  విష్ణువుపై పోశారని ఇతిహాసాలలో సైతం పేర్కొనబడి ఉందని తెలుస్తోంది. అలాగే సూర్య దేవుడికి కూడా ఈ రేగి పళ్ళు ఎంతో ఇష్టమైనవని పిల్లలకి ఈ పళ్ళు తలపై పోయడం ద్వారా దీర్ఘాయువు ఇస్తాడని నమ్మకం. అలాగే బోగి పళ్ళుని చిల్లర తో కలిపి పోయడం ద్వారా జ్ఞానం పెరుగుతుందని అంటారు. ముఖ్యంగా శ్రీ మహా విష్ణువు కి ఎంతో ఇష్టమైన ఫలం కావడంతో ఆయన అనుగ్ర్రహం పిల్లపై ఉండటానికి ఈ భోగి పళ్ళు తప్పకుండా పోయాలని అంటున్నారు పండితులు. .

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: