సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడిపందాలు అందరినీ ఆకర్షిస్తూ ఉంటాయి. కోడి పందాలను వీక్షించడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే.. కోడి పందాల్లో పాల్గొని పందెం వెయ్యాలి అనుకునే వాళ్ళు ఇంకొంతమంది.సంక్రాంతి పండుగలో భాగంగా కోడిపందాలు హోరెత్తి పోతుంటాయి. సంక్రాంతి లో రంగురంగుల రంగవల్లులు సాంప్రదాయమైన వస్త్రాలు గంగిరెద్దుల ఆటలు హరిదాసుల కీర్తనలు లేకపోతే పండుగ వాతావరణం వుండదు అని ఎలా అనుకుంటారో... కోడిపందాలు లేకపోయినా సంక్రాంతి సంక్రాంతి లాగే ఉండదు అనుకుంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడిపందాలు తప్పనిసరి. అసలు కోడిపందాలు లేని సంక్రాంతి సంక్రాంతి పండుగేనా  అనుకుంటారు ప్రజలు. 

 

 

 

 ఇక కోడి పందాల్లో  తమ పుంజులను బరిలోకి దింపేందుకు ఎంతోమంది సిద్ధమవుతారు. అయితే కోడి పందాల కోసం తమ పుంజులను సిద్ధం చేసేందుకు కొన్ని నెలల నుంచి ఎన్నో కష్టాలు పడుతూ వుంటారు చాలామంది. కోడి పుంజులుని పెంచడం అంత సులువైన పనేమీ కాదు. కోడి పందాల కోసం కొంతమంది పందెం కోళ్లను పెంచి వాటిని ఎక్కువ ధరకు అమ్ముకుని వ్యాపారం చేస్తుంటే ఇంకొంతమంది వారే స్వయంగా కోడి పందాల కోసం పందెం కోళ్లను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. పందెం కోళ్ళు బలంగా తయారవడానికి ఎంతో నాణ్యమైన ఆహారాన్ని పందెం కోళ్లకు అందిస్తూ వుంటారు. 

 

 

 అయితే పందెం కోళ్లు పెంచడం సాధారణమైన విషయం కానేకాదు. తాము పెంచాలి అనుకునే పందెం కోడిని  పిల్లల నుంచి పెద్దయి బరిలోకి దిగే  దాకా శ్రమిస్తూనే ఉంటారు నిర్వాహకులు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకూ కోళ్లను కన్నపిల్లల చంటి పిల్లల చూసుకుంటారు. కటౌట్ తోనే కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే ప్రభాస్ డైలాగ్ ఈ పందెం కోళ్ళకు  బాగా సెట్ అవుతుంది. కటౌట్ తోనే ప్రత్యర్థి ఖంగు తినేలా  పందెం కోళ్లను తీర్చిదిద్దుతారు. ఉదయాన్నే స్విమ్మింగ్ చేయిస్తారు. రన్నింగ్ స్విమ్మింగ్  వల్ల కూడా బలం గా తయారు కావడమే కాకుండా పైకి పక్కకు ఈజీగా ఎగరగలవు పందెం కోళ్ళు. ఎదుటి కోళ్లు దాడి చేస్తే క్షణాల వ్యవధిలో తప్పించుకుని తిరిగి ఎటాక్ చేసేలా గట్టి శిక్షణ ఇస్తారు. ఒక్కసారి తమ పందెంకోడి బరిలోకి దిగింది అంటే విజయం సాధించాల్సిందే అనే పట్టుదలతో పందెం కోళ్ళు పెంచుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: