మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అనగానే అందరికీ కోడిపందాలు అనే విషయం టక్కున గుర్తుకొస్తుంది. అలాగే తమిళనాడులో కూడా పొంగల్ పండుగ అనగానే జల్లికట్టు పండుగ జరుగుతుంది. జల్లికట్టు సందడి తమిళనాడులో మళ్లీ కనిపిస్తోంది. ఇది ఓ సంప్రదాయ క్రీడ. జల్లికట్టు... గ్రామీణ ప్రాంత వేడుక. సంక్రాంతి పండుగకు ముందు నుంచే జల్లికట్టు ఏర్పాట్లు ఊపందుకుంటాయి. ఎన్నెన్ని నిషేధాలు ఉన్నా, కోర్టుల ఆదేశాలు ఉన్నా జల్లికట్టు జరిగితీరాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లోనూ జ‌ల్లిక‌ట్టు ఉంటుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువ‌గా జ‌రుగుతాయి. ఇదిలా ఉంటే జ‌ల్లిక‌ట్టు గురించి కొని ఆస‌క్తిక‌ర విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

 

జ‌ల్లిక‌ట్టు ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట. ఎద్దును లొంగదీసేందుకు ఒక్కొక్కరుగా ముందుకెళ్లి ప్రయత్నిస్తుంటారు. ఎవరడ్డు వచ్చినా సరే ఆ రింగులో తిరుగుతూ కొమ్ములతో పొడుస్తూ ఉంటుంది. ఓవైపు భయం వెంటాడుతున్నా ధైర్యంగా జల్లికట్టులో పాల్గొంటుంటారు. జల్లికట్టు ఆచారం ఇప్పటిది కాదు. తమిళనాడులో తరతరాలుగా ఉన్నదే. పొంగల్ పండుగ సీజన్‌లో కనుమ రోజున ఈ సాహస పోటీలు జరుగుతుంటాయి. క్రీస్తు పూర్వం 400 ఏళ్ల సమయంలో జల్లికట్టు నిర్వహించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రస్తుతం జల్లికట్టుగా పిలువబడే ఈ పేరు పూర్వం సల్లి కట్టుగా ఉండేది. సల్లికట్టు అంటే ఎద్దు మెడలో బంగారం బాగా అలంకరించడం. 

 

ఎద్దుతో ఎవరైతే వీరోచితంగా పోరాడి ఆ బంగారాన్ని తీసుకొస్తారో వారే విజేతగా నిలుస్తారు. ఈ పోటీలో యువకులు మరణించిన ఘటనలతో పాటు, జంతువులు గాయపడ్డ ఘటనలూ ఉన్నాయి. దీంతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ ప్రమాదకర ఆటపై నిషేధం కూడా విధించింది.అయితే సంప్రదాయ వేడుక అయిన జల్లికట్టును కొనసాగించాలంటే అనేక సంస్థలు పోరాటాలు మొదలుపెట్టాయి. తమిళ ప్రజలు సైతం జల్లికట్టు ఉండాల్సిందే అని కోరుకున్నాయి. ఏకంగా రోడ్ల మీదకొచ్చి ధర్నాలకు దిగాయి. దీంతో చాలా వేల ఏళ్ల నాటికి జల్లికట్టు సంప్రదాయానికి అడ్డంకులు తొలగి యథావిథిగా సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: