ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను పెద్ద పండుగగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ పేరుతో పండుగను జరుపుకుంటారు. మొదటి రోజు భోగి మంటలతో, రెండవ రోజు పిండి వంటలు మరియు పొంగలితో మూడవ రోజు గో పూజలతో పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. 
 
సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందేలకు, ఎడ్ల పందేలకు, పేకాట, గుండాట, ఢంకాపలాస్ లాంటి జూదాలకు కూడా పెట్టింది పేరు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో నోట్ల కట్టలకు తాళ్లు తెగుతూనే ఉంటాయి. పందేల మోజులో, జూదాల మోజులో పడి లక్షల్లో కోల్పోతూ ఉంటారు. లక్షల రూపాయల నోట్ల కట్టలను పందేలలో పెట్టేవారిలో డబ్బులు పోగొట్టుకునేవారు భారీ సంఖ్యలో ఉంటే గెలిచేవారు మాత్రం తక్కువ సంఖ్యలో ఉంటారు. 
 
కోడి పందేలు, ఎడ్ల పందేల పేరుతో కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారుతుంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని ఉభయ గోదావరి జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలలో పందేలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పందెం రాయుళ్లు కోళ్లను పందేలకు దించి భారీ బెట్టింగుల మధ్య హోరాహోరీగా పోటీలను నడిపిస్తారు. నోట్ల కట్టలను తెంపే వారిలో కొందరు రాత్రికి రాత్రే లక్షాధికారులు కాగా కొందరు జేబులు ఖాళీ చేసుకుని రోడ్డున పడుతూ ఉంటారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: