అవును! చాలా మంది సంక్రాంతి అన‌గానే అప్పులు చేసేసి మ‌రీ నిర్వహిస్తుంటారు. కానీ, శాస్త్రం ఏం చెప్పిందో తెలు.. ఇత‌ర పండుగ‌ల విష‌యంలో ఎలా ఉన్నా.. సంక్రాంతికి మాత్రం అప్పులు చేయ‌కూడదట.

 

ఎందుకంటే.. ఇది పితృకార్యం. అంటే.. మ‌నకు జ‌న్మనిచ్చిన వారిని త‌లుచుకుని చేసుకునే పండుగ‌. కాబ‌ట్టి అప్పులు చేసి ఈ పండుగ‌ను నిర్వహించుకునే ప‌రిస్థితి ఉంటే.. అయ్యో మా పిల్లలు ఇంకా అప్పులు చేస్తున్నారే! అని పితృదేవ‌త‌లు శోకించే ప్రమాదం ఉంది.

 

అదే జరిగితే.. పండుగ మనకు పుణ్యం ఇవ్వక‌పోగా.. మ‌రింత బాధిస్తుంది. అందుకే ఉన్నదాంట్లోనే తృప్తిగా సంక్రాంతిని నిర్వహించుకోవాలి త‌ప్ప అప్పుల ఆర్భాటాల పండ‌గ కానే కాదు. అలాగని పండుగ చేసుకోకుండా ఎలా ఉంటాం. అంటారా.. ?

 

అందుకే ఈ పండుగ కోసం ముందు నుంచే కాస్త ప్లాన్ చేసుకోవడం ఉత్తమ పద్దతి. ఇక నుంచైనా సరే.. సంక్రాంతి పండుగ వస్తుందంటే నాలుగైదు నెలల నుంచే ఏమేం ఖర్చులు ఉంటాయో ఊహించుకుని.. దానికి తగ్గట్టుగా ఆదాయ మార్గాలు చూసుకోవడం మంచిది.

 

మిగిలిన పండుగ సంగతి వేరు. కానీ సంక్రాంతి కాలంతో పాటు చేసే పండుగ.. సూర్య గమనాన్ని బట్టి చేసుకునే ఏకైక పండుగ.. మన పెద్దలను స్మరించుకునే పండుగ. అందుకే ఈ సంక్రాంతి ప్రత్యేకతను గుర్తించండి.. సాధ్యమైనంత వరకూ అప్పులకు దూరంగా ఉండండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: