మన పండుగల్లో సంక్రాంతికి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే.. కాలం ఆధారంగా చేసుకునే పండుల్లో ఇది ప్రధానమైంది. అది కూడా సూర్య గమనాన్ని ఆధారంగా చేసుకునే విశిష్టమైన పండుగ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశంచే పుణ్య సమయం. అందుకే ఆ సంక్రమణాన్ని సంక్రాంతిగా చేసుకుంటాం.

 

అయితే.. సంక్రాంతి వేళ సంబరాలతో పాటు కొన్ని పుణ్య క్రతువులు కూడా చేయాలి. అప్పుడే పండుగకు అర్థం పరమార్థం ఉంటుంది. వాటిలో ఒకటి ఈ మహేశ్వరార్పణం. ఇది సంక్రాంతి రోజు మధ్యాహ్నం చేయాలి. మ‌ధ్యాహ్న స‌మ‌యానికి అధిదేవ‌త మ‌హేశ్వరుడు. శాస్త్రాల్లో మ‌ధ్యాహ్న కాలానికి చాలా వైశిష్ట్యం ఉంది.

 

మ‌ధ్యాహ్నం భోజ‌న స‌మ‌యానికి సంక్రాంతి నాడు క‌నీసం ఒక్కరికైనా బ‌య‌ట‌వారికి మ‌నం ఏరకంగా అయితే భోజ‌నం చేస్తామో..అన్ని ర‌కాల ప‌దార్ధాల‌తోను.. అదేవిధంగా మ‌హేశ్వరుడిగా భావించి భోజ‌నానికి ఆహ్వానించి ఆతిథ్యం అందించాలి ఇది మ‌హేశ్వరార్పణం. అందునా ఉత్తరాయణ ప్రారంభంలో చేసేది కోటి రెట్ల పుణ్యం ఇస్తుంద‌ని పెద్దలు చెబుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: