సంక్రాంతి సంబరాల సమయం.. రోజంతా ఆనందాల హరివిల్లు విరియాలి. ఈ ఆనందం కోసమే జనం సొంత ఊళ్లకు ఎన్నో కష్టాలు పడి వెళ్తారు. పండుగ రోజు ఉదయం పూజలతో సరిపోతుంది. ఆ తర్వాత విందు.. ఇక ఆ తర్వాత ఎన్నో సంక్రాంతి సంబరాలు ఉన్నాయి.

 

పిండి వంటలు, సినిమాలు, కోడి పందేలు.. ఇలా ఒక్కో వయస్సుకు తగ్గట్టు వినోదాలు ఉన్నాయి. అయితే సంక్రాంతి వేళ ఎన్ని వినోదాలు ఉన్నా.. సాయంత్రం మాత్రం అలా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి.. వ్యాహ్యాళికి వెళ్లి రావాలి.

 

ఎందుకంటే ఎన్నో రోజుల తర్వాత సొంత ఊరికొస్తాం.. అందుకే అందరినీ ఒకసారి పలకరించాలి.. అప్పుడే బంధాలు బలపడతాయి. అంతే కానీ.. మనం, మన ఇల్లు, మన కుటుంబం అంటూ గిరిగీసుకోకూడదు. ఇలాంటి సమయాల్లో ఊళ్లో అంతా కలిసేది.

 

చిన్నప్పటి స్నేహితులు, చుట్టాలు, పక్కాలు అందరికీ మీ పిల్లను పలకరించండి.. వారి ప్రత్యేకతలను వివరించండి.. మీ చిన్నతనాన్ని మీ పిల్లలకు వివరించండి.. మీ చిన్నతనంలో మీ మరపురాని సంఘటనలు చెప్పండి..మీ ఊరి ప్రత్యేకతలు చెప్పండి.. అప్పుడే మీకు ఈ సంక్రాంతి ప్రత్యేకతంగా నిలుస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: