తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయానికి నిలువుటద్దంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి సంబరాలు తెలుగు రాష్ట్రాల్లో  అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఇక తెలంగాణ రాష్ట్రం కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటేలా జరుగుతాయి. ఉద్యోగాలు వ్యాపార నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారందరూ సంక్రాంతికి సొంతూళ్లకు చేరి సందడి చేస్తూ ఉంటారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 

 

 

 

 సంక్రాంతి వచ్చిందంటే రంగురంగుల రంగవల్లులు... హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల ఆటలు... ఇంటి ముందు గొబ్బెమ్మలు.. గొబ్బెమ్మల పక్కన నవధాన్యాలు... అంతేకాకుండా చుట్టూ అంతా కలర్ ఫుల్ గా  పండుగ వాతావరణం... ఇక సంక్రాంతికి కొత్త అల్లుళ్లు తో నిండిన అత్తారిల్లు... సాంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచులు... ఇలా ప్రతి ఒక్కటి తెలుగు సంప్రదాయానికి అద్దం పట్టేలా సంక్రాంతి పండుగనాడు కనిపిస్తూ ఉంటుంది. అందుకే తెలుగు ప్రజలు సంక్రాంతిని వైభవంగా నిర్వహించుకుంటారు. అంతే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు చోట్ల సంక్రాంతి పండుగనాడు కోడి పందాలు కూడా జరుగుతూ ఉంటాయి. 

 

 

ఇక సంక్రాంతి పండుగకు పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. సంక్రాంతి పండుగ రోజు మధ్యాహ్న సమయానికి శాస్త్రాలు చాలా వైవిష్ట్యం  కలిగి ఉంది. మధ్యాహ్న సమయానికి ఆదిదేవత మహేశ్వరుడు భువికి దిగివస్తారని... అందుకే సంక్రాంతినాడు ఒక్కరికైనా బయట వారికి మనం ఏ రకంగా అయితే భోజనం చేస్తామో  అన్ని రకాల పదార్థాలతో.. ఆ వ్యక్తి మహేశ్వరుడిగా  భావించి భోజనానికి ఆహ్వానించి ఆతిథ్యం అందించాలి అని ... ఇది మహేశ్వరర్పణం అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఉత్తరాయణ ప్రారంభంలో చేసే ధానంతో  కోటి రెట్లు పుణ్యం వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: