సంక్రాంతి మూడు రోజులు ముచ్చటైన పండుగ.. గతంలో ఈ పండుగ ఐదు రోజులు ఉండేదట. ఐదు రోజులకూ ఐదు ప్రత్యేకతలు ఉండేవట. కానీ ఇప్పుడు ఇది మూడు రోజులకు కుచించుకుపోయింది. ఐనా.. ఈ మూడు రోజులకూ అనేక విశిష్టతలు ఉన్నాయి.

 

ప్రత్యేకించి.. మూడు రోజులూ ఉదయాన్నే స్నానాలు చేస్తారు. వీటిలో భోగి రోజు స్నానాలకు విశిష్టత ఉంది. ఆ రోజు అభ్యంగన స్నానం చేస్తే దరిద్ర లక్ష్మి దూరమవుతుందంటారు. అయితే.. అలాగే సంక్రాంతి రోజు స్నానం కూడా శుభం చేకూరుస్తుంది.

 

ఇక మూడో రోజైన కనుమ రోజు మాత్రం స్నానానికి ఎలాంటి ప్రత్యేకత, ప్రాధాన్యం లేదు. అంతే కాదు.. ఈ కనుమ రోజు అభ్యంగన స్నానం చేయకూడదని అంటారు. అంటే తల నుంచి పాదం వరకూ నువ్వుల నూనెతో చేసే స్నానం కనుమ రోజు చేయకూడదట.

 

 

ఇదీ కనుమ స్నానం కథా కమామీషు. అయితే కనుమ రోజును పితృదేవతల స్మరణకు ప్రత్యేక రోజుగా భావిస్తారు. ఆ రోజు మన పెద్దలను పూజించుకోవాలి. అదీ ప్రత్యేకం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: