సంక్రాంతి.. మూడు రోజుల ముచ్చటైన పండుగ.. తొలి రెండు రోజులు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతాయి. ఈ రెండు రోజులు పండుగకు ప్రాణం. అయితే ఇవి ఎలా జరుపుకున్నా చివరి రోజైన కనుమ మాత్రం పితృదేవతల స్మరణకు ప్రత్యేక రోజుగా భావిస్తారు. ఆ రోజు మన పెద్దలను పూజించుకోవాలి. అదీ కనుమ ప్రత్యేకం.

 

సంక్రాంతి ముగిసిన త‌ర్వాత రోజును క‌నుమగా చేసుకుంటారు. అయితే, ఈ రోజుకు చాలా విశిష్టత ఉంది. పితృదేవ‌ల‌కు త‌ర్పణ విడిచి పెట్టాలి. లేదా శ్రాద్ధ క‌ర్మను చేసి వారిని స్మరించుకోవాలి. ఇలా మన చేస్తే.. మన పితృ దేవతలు ఆత్మలు శాంతిస్తాయి. వాటికి సద్గతులు కలుగుతాయి.

 

మన ఈ జన్మకు కారణమైన వారు వారే.. వారు లేకుంటే మన ఉనికే లేదు. అందుకే ఏడాది పొడవునా వారిని పూజించకపోయినా.. ఇలాంటి కనుమ రోజుల్లో వారిని స్మరించుకోవాలి. వారికి ఇష్టమైన ఆహార పదర్ధాలు వండి నైవేద్యం పెట్టాలి. వారి పేరు మీద సంతర్పణ చేయాలి. అలాగే వారికి తర్పణం వదలాలి. అలా చేస్తే మన పూర్వీకులకు మోక్షం లభిస్తుందని చెబుతారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: