సంక్రాంతి.. తెలుగు వారి అతి పెద్ద పండుగ. అందులోనూ పంట చేతికి వచ్చే సమయంలో వచ్చే పండుగ. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను ఆనందంగా జరపుకుంటారు. సరిగ్గా చెప్పాలంటే ఇది రైతు పండుగ. వ్యవసాయంపై ఆధారపడేవారి ప్రధానమైన పండుగ.

 

అందుకే ఈ పండుగ కోసం జనం ఏడాదంతా ఎదురు చూస్తారు. అసలు పల్లెలు కళకళలాడేది ఈ సంక్రాంతి సమయంలో. ఈ మూడు రోజుల పండగ వేళ పల్లెల్లో కొత్త వెలుగులు నిండుతాయి. ఉపాధి కోసం జీవిక కోసం ఎక్కడెక్కడికో వెళ్లినవాళ్లంతా సంక్రాంతికి మాత్రం సొంత ఊరుకు చేరుకుంటారు.

 

బావున్నావా..బాబాయ్,.. ఏరా అబ్బాయ్ ఇదేనా రావడం.. అమ్మాయి బావుందా.. పిల్లలు ఏం చదువుతున్నారు. ఎప్పుడో.. చూశా.. మళ్లీ ఎన్నాళ్లకు చూశాన్రా.. ఇలాంటి పలకరింపులతో పల్లెకు మళ్లీ జీవకళ వస్తుంది. కొత్త అళ్లుళ్ల రాక.. బంధువుల సందడి.. అబ్బో ఒకటేమిటి..

 

అందుకే ఈ నాలుగు రోజులూ పల్లెలు సంతలను తలపిస్తాయి. అనుబంధాలను గుర్తు తెచ్చుకుంటాయి. సంప్రదాయాలను పాటిస్తాయి. సంస్కృతిని పునరుజ్జీవింపజేస్తాయి. ఇక ఇదే సమయంలో నగరాలు బోసి పోతాయి. ఉన్న కొద్దిపాటి మందీ ఏదో ఒక సినిమా బుక్ చేసుకుని ఏదో పండుగ చేశామనిపిస్తారు. అందుకే ఇది పల్లె పండుగ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: