మూడు రోజుల ముచ్చటైన తెలుగింటి పండుగ మన సంక్రాంతి. తొలి రోజు భోగి మంటలతోనూ.. సాయంత్రం పిల్లలకు భోగి పళ్లు పోయడంతోనూ సరిపోతుంది. అప్పుడే ఊళ్లలోకి దిగిన బంధువులు, స్నేహితులతో సందడిగా ఉంటుంది. ఇక మకర సంక్రాంతి రోజు సంక్రాంతి ఆనందం ఓ స్థాయికి చేరుతుంది.

 

ఉదయాన్నే పూజలు, ఆ తర్వాత పిండివంటలు, కోడిపందేలు, సినిమాలు, షికార్లు.. ఇలా పండుగ ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఇక మూడో రోజు.. సంక్రాంతి ఆనందం క్లైమాక్స్ కు చేరుతుందనే చెప్పాలి. అయితే ఈ మూడో రోజు తప్పకుండా చేయాల్సిన పని ఒకటి ఉంది.

 

అదేమిటంటే.. తొలి రెండు రెండు రోజుల్లోనూ బంధువుల‌ను క‌లుసుకుని వారితో గ‌డిప‌డం వ‌ర‌కు బాగానే ఉన్నా.. క‌నుమ నాడు మాత్రం ఖ‌చ్చిత‌ంగా స్నేహితుల‌ను కలుసుకోవాలి. తెలిసిన వారిని క‌లిసి..క‌ష్టసుఖాల‌ను పంచుకోవాలి. వారి ప‌ట్ల కూడా ప్రేమ‌ను పంచాలి.

 

ఇలా సిసలైన స్నేహితుల కలయికతోనే సంక్రాంతి సంబరానికి ఒక అర్థం వస్తుంది. ఒకరి కష్ట సుఖాలు మరొకరు కలబోసుకున్నప్పుడే బంధాలు మరింతగా వికసిస్తాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: