శుభ్రత,  కొత్తపంట,  పెద్దల గౌరవం ప్రాముఖ్యత చెప్పే భోగి , పొంగలి, కనుమ వేడుకులు  తెలుగు ప్రజలు మరియు దక్షిణ  భారతీయులు అత్యంత పురాతన  మరియు ముఖ్యమైన  సాంప్రదాయాలు.  ఈ  పొంగలి  వేడుకలు  తమిళ  క్యాలెండరులో మార్గశిర  నెలలో  ఆఖరి రోజు నుంచి మొదలవుతాయి.

ఇటీవల వాడుకలోకి  తెచ్చిన  సంక్రాంతి  అనే సంస్కృత పదం, మన  తెలుగు పొంగలి  అనే పదం రెండూ వేర్వేరు అర్ధాన్ని స్పురిస్తాయి.  సంక్రాంతి  అర్ధం సూర్యుడు  ఒక  రాశిలో నుండి  వేరే  రాశికి  వెళ్ళడం.  సంవత్సరంలొ 12 సంక్రాతులు వస్తాయి.  మన  పొంగలి  లేదా  పొంగల్  అర్ధం  కొత్త పంట “పొంగడం”.

పొంగలి  రోజు కొత్త పంట యొక్క మొదటి బియ్యం కొత్త కుండలో వేడి చేసి పొంగేటట్టు చేస్తారు .  మనకు  కావలిసిన దానికన్నా మిగులు  వుండాలని  అని  ఆశిస్తారు.  పశువులని కూడా  పండుగలో  భాగస్వామ్యం  చేసి  ఒకరోజు  పశువులకు  సెలవు  అనుమతిస్తారు.

ఎద్దు  కొమ్ములకు ఆకర్షణమీయమైన రంగులద్దడమే కాక, అందమైన బట్టలు కప్పుతారు.  పూర్వ కాలంలో ఇళ్ళుకి  వెల్లపోసి  పూర్తిగా శుభ్రం చేయించుకునేవారు.

పండుగ మూడు రోజులు జరుపుకుంటారు:  మొదటి రోజు  భోగి మంటలు వేసి వ్యర్ధమై గృహవస్తువులను పారేస్తారు. రెండవరోజు  పొంగలి బియ్యం పొంగిస్తారు. మరియు అదనంగా  కనుమ రోజున పిల్లలు పెద్దల  దీవెనలు కోరుకుంటారు, అనుసరిస్తారు. ఈ  వేడుకలలో  కోడి, మేక వంటి మాంసాహారం వండుకుంటారు.

ఈ వేడుకులు తెలుగు జాతి వేల సంవత్సరాల నాటి  చారిత్రక  సంప్రదాయం. మతాలకు అతీతమైనవి.  అమెరికన్లు  జరుపుకునే  సంయుక్త  పండుగ  “థాంక్స్ గివింగ్” వంటి సాంప్రదాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: