తెలుగు వారు పెద్ద పండుగ అని ముద్దుగా పిలుచుకునే పండుగ సంక్రాంతి. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపేడే విధంగా సంబరాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి సంక్రాంతి తరువాత వచ్చే పండుగ కనుమ ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు వేరైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు.

 

సంక్రాంతి వ‌చ్చిందంటే.. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. వేకువ జామున హరినామ సంకిర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మల్లిస్తాడు. గంగిరెద్దులు, కోడి పందాలు, ఎడ్ల పందాల మాట సరేసరి. ఒక్కమాటలో చెప్పాలంటే మన తెలుగు సంప్రదాయం మొత్తం ఈ పండుగలోనే చూడ‌వ‌చ్చు. అయితే నేటి త‌రంలో మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు మరుగున పడిపోతున్నాయి. మన సనాతన ఆచారాలు, విశ్వాసాలు గాలిలో దీపంలా రెపరెపలాడుతున్నాయని చెప్పక తప్పదు. 

 

ఏదో అక్కడక్కడా పాతతరం వాళ్ళు వున్న ఇళ్ళల్లో తప్పితే ఎక్కడా కానరావడంలేదు. ఈనాటి కొత్తతరం వాళ్ళు పాత ఆచారాలను, సనాతన ధర్మాలను మూఢ నమ్మకాలుగా పాత చింతకాయ పచ్చడిగా భావిస్తూ తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు. అయితే వాళ్ల‌కు సంస్కృతి నేర్చించే బాధ్య‌త పెద్ద‌వారిదే. పండగలు అనేవి మన సంస్కృతి. మన జీవితంలో మనం ఎంత బిజీ గా ఉన్న ఎన్ని కోట్లు సంపాదించినా పండగలు మిస్ అవ్వొద్దు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో పండగలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే చాలా గొప్పది పెద్దది.

మరింత సమాచారం తెలుసుకోండి: