సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే సంక్రాంతి నాడు.. సొంత ఊరికి వెళ్లి, సొంత వాళ్లను కలిసి ఆనందంగా జ‌రుపుకునే పండ‌గ‌. సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. 

 

తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపేడే విధంగా సంబరాలు జరుగుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఎదురుచూసే పండగ ఇది. ప్రతి ఒక్కరూ పాలుపంచుకనే పండుగ కూడా. ఇక సంక్రాంతి పండుగ అనగానే గుర్తొచ్చేది కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, గొబ్బెమ్మలు.. వీటితో పాటు ప్రధానంగా ప్రతి ఇంటా ఘుమఘుమలాడే పిండివంటలు. సంప్రదాయ పిండివంటలు నోరూరిస్తూ సంక్రాంతి ప్రత్యేకతను తెలియజేస్తుంటాయి. పూర్వీకులు నిర్ణయించిన సంప్రదాయక వంటలే అయినప్పటికీ వాటిలో పోషకాలు అత్యధికమని వైద్యనిపుణుల అభిప్రాయము.

 

అసలు గ్రామాల్లో ఉండే రుచి పట్టణాలకు తెలుసా...? పిండి వంటలు, పండగ మూడు రోజులు వండుకునేవి, అసలు నెయ్యి అంటే ఎలా ఉంటుంది...? గ్రామాల్లో చేసే వంటలు సహజ సిద్దంగా ఎంత రుచిగా ఉంటాయి. వాటి గురించి తెలియాలంటే ఖ‌చ్చితంగా పెద్ద‌ల వ‌ద్ద‌కు వెళ్తి తెలుసుకోవాల్సిందే. ఇక ముఖ్యంగా సంక్రాంతి పండగ అనగానే ముందుగా గుర్తుకొచ్చేవి అరిసెలు. అరిసెలు లేని సంక్రాంతిని ­ఊహించుకోవడం కష్టం అంటే దాని ప్రాధాన్యత తెలుసుకోవచ్చు. బెల్లంతో చేసిన అరిసెలు ఆరోగ్యానికి శ్రేష్ఠం. 

మరింత సమాచారం తెలుసుకోండి: