మొత్తానికి ఈ ఏడాది ఆనందాల సంక్రాంతి పండుగ రానే వచ్చింది. ప్రతి ఏటా వచ్చే అతి పెద్ద పండుగల్లో ఒకటైన సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరు కొత్త బట్టలు కొనుక్కుని కట్టుకోవడం, తమ ఇళ్లను పూలతో అలంకరించడం, ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు పెట్టి, రకరకాల పిండి వంటలు, ఇంటికి కొత్త అల్లుళ్లను ఆహ్వానించడంతో పాటు ఇల్లంతా నిండిపోయిన చుట్టాలతో ఎంతో సంబరంగా ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకుంటారు. అయితే నేడు ఒకప్పటితో పోలిస్తే పండుగ యొక్క ప్రాశస్త్యం తగ్గుతూ పోతోంది అనే చెప్పాలి. 

 

ఇక పల్లెటూళ్లలోనేమో తల్లితండ్రులు ఉండడం, ఇక ఇటువంటి పండుగలకు ఎక్కడో దూరంగా పట్నాల్లో ఉండి చదువులు, లేదా ఉద్యోగాలు చేసుకునే వారి బిడ్డలు, పండగ సమయానికి తమ ఊళ్లకు చేరుకున్నప్పటికీ కూడా చేతిలో ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లు పట్టుకుని అక్కడ కూడా తమ ఫ్రెండ్స్ తో చాటింగ్స్ వంటివి చేస్తుండడం గమనించవచ్చు. అయితే  ఏడాది అంతా మీ వ్యాపారాలు, ఉద్యోగాలు, చదువులు అంటూ ఎక్కడో ఉంటారు కదా, అందుకే సంక్రాంతి పండగ మూడు రోజులు అయినా సరే అవన్నీ పక్కన పెట్టి, మీకోసం తపించిన అమ్మా నాన్నలకు సంక్రాంతి పండగను వారితో కలిసి ఎంతో సంతోషంగా  జరుపుకునేందుకు ప్రయత్నించండి. 

 

మీ కోసం ఎదురు చూస్తున్న తల్లితండ్రులు కోరుకున్న విధంగా ఇంటికి వచ్చాక వీలైనంత ఎక్కువ సేపు వారితో కలిసి మెలిసి గడపడం, చక్కగా ఇల్లంతా కలిసి భోజనాలు చేయడం, దైవ దర్శనాలకు వెళ్ళడం, అలానే సరదాగా పలు ఆట పాటలతో మన ఇంట్లోని వారికి మంచి ఎంటర్టైన్మెంట్ వంటివి ఇవ్వడం, వీలైనంత ఎక్కువసేపు వారితో కలిసి సరదాగా కబుర్లు చెప్పడం వంటివి చేస్తే, ఎప్పుడో ఒకప్పుడు ఈ విధంగా మన తల్లితండ్రులను చూడడానికి వచ్చే మనం వారికి ఇచ్చే ఇంతకంటే గొప్ప కనుక మరొకటి ఉండదని మరువకండి. మీరు దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగం, చదువులతో ఎంత కాలం గడిపినా, పండుగల సమయంలో ఇంటికి వచ్చి వారితో సరదాగా గడిపే ఈ కొద్దీ రోజులే వారికి ఎప్పటికీ తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: