సంక్రాంతి.. మనం ఎంతో ఆనందంగా కుటుంబం అంత ఒక చోటకు చేరి జరుపుకునే పండుగ.. రంగు రంగుల ముగ్గులతో.. పిండి వంటలతో ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఒక పక్క కోడి పంద్యాలు.. మరో పక్క ఆవు పంద్యాలు.. మధ్యలో పందుల పంద్యాలు. 

 

ఇలా పంద్యాలు.. పిండి వంటలు.. రంగు రంగుల ముగ్గులు.. ఇన్ని ఉండగా అమ్మమ్మ గారాభం.. అమ్మ ప్రేమ.. చెల్లితో గొడవలు.. పసి పిల్లల ముఖాలు ఇన్ని చూస్తున్న సరే.. ఏదొక టెన్షన్ ఉండనే ఉంటుంది.. అయ్యే ఇంకా అది చెయ్యలేదే.. ఇది చెయ్యలేదే.. బాస్ ఫోన్ చేసి చంపుతున్నడే ఛీ మన బతుకు అని తిట్టుకునేలా మన జీవితం ఉంటుంది. 

 

పెద్ద పండుగా.. కొత్త సంవత్సరంలో మొదటి పండుగా ఈ పండుగాలో కూడా టెన్షన్ పడాల ? మనం జీవితం అంత ఎప్పుడూ ఏదో టెన్ష‌న్‌లు ఉంటాయి.. పండగ పూట అయినా సంతోషంగా ఉందాం...వ్యాపార ఒత్తిడి, ఉద్యోగ ఒత్తిడి, చదువులు ఇలా ఎప్పుడు ఎదోక ఆందోళనలతో మనం బతుకుతున్నాం. సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ, కాబట్టి ఈ రోజు అయినా సరే సంతోషంగా ఉందాం. ఒక్క రోజు పని చెయ్యకపోతే ఆఫీస్ ఏం మునిగిపోదు కదా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: