మనం.. ఎంత కష్టపడినా.. ఎంత సుఖపడిన అష్టఐశ్వర్యాలతో ఉండాలి అనుకుంటాం. ఎందుకంటే ఈ కాలంలో ఐశ్వర్యానికి ఇచ్చిన విలువ మనిషికి ఇవ్వరు కాబట్టి.. మన అనుకునే వాళ్ళు కూడా మనల్ని చూడరు. అందుకే ఎంతోమంది ఐశ్వర్యవంతులు కావాలని కష్టపడతారు. అయితే ఎంత కోటీశ్వరుడికి అయినా కష్టం తప్పదు.. 

 

అసలు మన ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా ? మన కుటుంబం.. పేదవాడికి కష్టం తప్పదు.. కోటీశ్వరుడికి కష్టం తప్పదు.. ఆ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..  జీవితంలో క‌ష్టాలు, క‌న్నీళ్లు లేనివారంటూ ఎవ‌రూ ఉండ‌రు. ''కోటీశ్వ‌రునికీ క‌ష్టంబు నిక్క‌మే..'' అంటారు.. స‌త్య‌హ‌రిశ్చంద్ర త‌న భార్య చంద్ర‌మ‌తితో. 

 

కాబట్టి క‌ష్టాలు లేనివారు లేరు. అయితే, సంక్రాంతి ఈ క‌ష్టాల నుంచి ప్ర‌తి ఒక్క‌రినీ గ‌ట్టెక్కించే పండ‌గ‌. ఈ రోజు ల‌క్ష్మీదేవి ప్ర‌స‌న్న మూర్తియై.. ప్ర‌తి ఇంటినీ ప‌రిశీలిస్తుంద‌ట‌. ఎవ‌రింట్లో ఆనందం తాండ‌విస్తుందో.. భార్య భ‌ర్త‌ను గౌర‌వించేచోట‌, భ‌ర్త భార్య‌ను ప్రేమించే చోట‌. పిల్ల‌లు తల్లిదండ్రుల‌ను పూజించే చోట ఆమె నివ‌శిస్తుంది. మ‌రి ఈ భాగ్యం మ‌న‌కు క‌ల‌గాలంటే.. ఎలాంటి పొర‌పొచ్చాలు లేకుండా సంక్రాంతి నాడు కొత్త బ‌ట్ట‌ల‌తో ఆనందంతో ఉండ‌డ‌మే! 

మరింత సమాచారం తెలుసుకోండి: