సంక్రాంత్రి.. మూడు రోజుల పండుగ... ఈరోజుతో రెండు రోజుల పండుగా ముగిసింది. ఇంకా ఒక్కరోజు పండుగ ఉంది. అంతే... ఈ పండుగ సమయంలో కుటుంబంతో కలిసి ఎంతో సంబరంగా ఎంజాయ్ చేశాము.. అయితే సంక్రాంత్రి చివరి రోజు కనుమను కృతజ్ఞత పండుగ అని ఎందుకు అంటామో తెలుసా ?  

 

క‌నుమ పండుగ కృతజ్ఞ‌త‌కు పెద్ద‌పీట వేస్తుంది. మ‌న‌కు సేవ చేసే ప‌శువులు, ఇంట్లో పాలేర్లు.. స‌హా ఇత‌ర మ‌నుషుల‌ను స‌త్క‌రించుకునే పండుగగా క‌నుమ‌ను పేర్కొంటారు. క‌నుమ యువ‌త‌ల‌కు ఆట‌ప‌ట్ట‌యిన పండుగ‌. ఉయ్యాల‌లు ఊగుతూ.. కొత్త చెరుకు గ‌డ‌లు తింటూ.. కుటుంబ స‌భ్య‌ల‌తో గ‌డిపే రోజు కనుమ.. 

 

అందుకే కనుమ పండుగను కృతజ్ఞత పండుగ అని అంటారు. అయితే ఈ పండుగను కృతజ్ఞత పండుగ గురించి ఈ తరం యువతకు ఏ మాత్రం తెలియదు.. ఇప్పటి యువతకు కనుమ పండుగ గురించి తెలిసింది ఏంటంటే.. చికెన్ ముక్కలు.. మటన్ ఫ్రై మాత్రమే ఈ తరం యువతకు తెలుసు.. 

 

ఆలా అవ్వడానికి కారణం.. మన పెద్దలు అనే చెప్పాలి.. ఎందుకంటే చిన్నప్పుడు మనం కనుమ పండుగ అంటే ఏంటి అని అడిగినప్పుడు పూర్తిగా తెలుసుకోకుండా చికెన్ పండుగ.. సి పండుగ అని చెప్పి మన సంప్రదాయాల గురించి మనకు తెలీకుండా చేస్తారు.. ప్రస్తుతం అంత అలాగే జరుగుతుంది లెండి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: