సంక్రాంతి.. మూడు రోజుల పండుగ ఈరోజు పూర్తి.. మొదటి రోజు భోగి.. రెండొవ రోజు సంక్రాంతి.. మూడోవ రోజు కనుమ.. ఇలా మనకు ఈ మూడు పండుగలు తెలుసు.. ఈ మూడు రోజుల పండుగను ఘనంగా జరుపుకుంటాం. ఎంత ఘనంగా అంటే.. పక్క దేశాలలో ఉన్న సరే.. ఈ పండుగకు మన ఉరికి వచ్చెనంత ఘనంగా మనం పండుగను జరుపుకుంటాం. 

 

అయితే ఈ మూడు రోజుల సంక్రాంతి పండుగా అంద‌రికీ తెలిసిందే. ఈ మూడు రోజులు ఎందుకు? ఎలా చేసుకోవాలో కూడా అందరికి తెలిసిందే. కానీ, ముక్క‌నుమ అనే పండుగ ఉంది అని.. ముక్కనుమ గురించి ఎంద‌రికి తెలుసు? అనే విష‌యమే ఇప్పుడు ప్ర‌ధానం. ఈ ముక్కనుమ పండుగపై రెండు వివాదాలు ఉన్నాయి. 

 

అస‌లు ముక్క‌నుమ అనేది శాస్త్రాల్లో లేద‌ని ఒక వాద‌న‌ ఉంది. ఎవ‌రో తీసుకువ‌చ్చి క‌నుమ‌కు అతికించార‌ని, ఇది అలా అలా ప్ర‌చారంలోకి వ‌చ్చింద‌ని అంటారు. మ‌రో వాద‌న ప్ర‌కారం ముక్క‌నుమ అనేది ఉంద‌ని. సో.. ఈ రెండు వివాదాల మ‌ధ్య ఈ పండ‌గ కొన్ని చోట్ల జ‌రుపుతున్నారు అని మ‌రికొన్ని చోట్ల వ‌దిలేస్తున్నారు అని సమాచారం.  మరి ఈ వివాదలలో ఏ వివాదం నిజమైనది ? ఏది అబద్దం అనేది ఎవరికి తెలియదు... ఏది ఏమైనా రాయలసీమ ప్రాంతాలలో అయితే ఈ ముక్కనుమ అనే పేరు కూడా చాలామందికి తెలియదు.. పెద్దలకు కూడా ఈ ముక్కనుమ గురించి తెలియదు అని సమాచారం.. మరి ఇంకా ఈ ముక్కనుమాను ఎవరు ? ఏ ప్రాంతం వారు జరుపుకుంటున్నారో..!? 

మరింత సమాచారం తెలుసుకోండి: