తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై రద్దీ రోజుల్లోనూ భక్తులకు కాస్త ఎక్కువగా గదులు దొరికే వెసులుబాటు లభిస్తోంది. తిరుమలలో రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో భక్తుల డిమాండ్‌ మేరకు గదులను అందుబాటులోకి తెచ్చేందుకు తాజాగా టీటీడీ అమలు చేస్తున్న సంస్కరణలు ఇందుకు కారణం. భక్తులకు ఉపశమనం కలిగించేందుకు టిటీడి ఏకంగా తమ అధికారులకే షాక్ ఇచ్చింది.

 

టీటీడీలో పని చేసే అధికారుల హోదాను అనుసరించి చేసే గదుల కేటాయింపును ఇప్పుడు సమీక్షించింది. ప్రస్తుతం తిరుమలలో పనిచేసే అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు కొండపైనే కొన్ని గదులు కేటాయించారు. టీటీడీ , పోలీస్‌, ఆర్టీసీ, పర్యాటక, వైద్య తదితర 44 విభాగాల ఉద్యోగులకు కలిపి 652 గదులను రిజర్వ్‌ చేసి ఉంచారు. అయితే అత్యవసర సేవల కోసం ఉద్దేశించిన ఈ వెసులుబాటును చాలా మంది దుర్వినియోగం చేస్తున్నారు.

 

కొందరు అధికారులు వీటిని గెస్ట్ హౌజుల్లా మార్చుకున్నారు. ఎందుకంటే వీటి అద్దె నామమాత్రంగా ఒక్కో కాటేజీకి రూ.30 మాత్రమే. అందుకే ఇవి దుర్వినియోగం అవుతున్నాయి. ఈ పద్దతిని సమీక్షించిన టీటీడీ ఇకపై వీటిని కూడా భక్తులకు కేటాయించాలని నిర్ణయించింది. దీంతో భక్తులకు అందుబాటులోకి వచ్చే అతిథి గృహాల సంఖ్య మరికాస్త పెరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: