తెలంగాణలోని మేడారం జాతరేంటి.. ముంబైలోని అమితాబ్ బచ్చనేంటి.. వీరిద్దరికీ లింకేంటి అనుకుంటున్నారా.. అవును.. ఈ రెండింటికీ భలే లింకు కుదిరింది. ఎలాగంటే.. మేడారం మహాజాతర విశేషాలతో వీడియోను ఇటీవల తెంలగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది.

 

మేడారం జాతరకు దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించడం ఈ వీడియో ఉద్దేశ్యం. అందుకే దీన్ని తెలుగు, ఇంగ్లిషు, హిందీ భాషల్లో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆంగ్లం, హిందీ వీడియోల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ తన వాయిస్ ఓవర్ చెప్పారు.

 

రెండేళ్లకు ఓసారి జరిగే జాతర ఆసియా ఖండంలోనే అతి పెద్దదిగా జరిగే ఈ జాతరను అమితాబ్ వర్ణించారు. జాతర విశేషాలను వీడియోలో వివరించారు. ఓవైపు ఈ జాతర కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రంపై తెలంగాణ సర్కారు ఒత్తిడి తెస్తోంది.

 

అందుకే జాతర విశేషాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మారు మోగాలనే ఉద్దేశంతో ఈ వీడియోను రూపొందించామని మంత్రి సత్య వతి రాథోడ్ అంటున్నారు. ఈ వీడియోతో మేడారం జాతర ఖ్యాతికెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: