గుడిలో ప్రసాదం అంటే ముందు మనకు గుర్తొచ్చేదేంటి.. లడ్డూ, పొంగలి, పులిహోర. ఇవేగా.. మనకేంటి.. ఎవరికైనా గుడి ప్రసాదం అంటే ఇవే గుర్తొస్తాయి. అయితే తమిళనాడులోని ఓ గుడి మాత్రం చాలా వెరైటీ. అక్కడ గుడి ప్రసాదంగా మటన్ బిర్యానీ పెడతారట. 84 ఏళ్లుగా ఇక్కడ బిర్యానీని ప్రసాదంగా పంచే సంప్రదాయం కొనసాగుతోందిట.

 

వైరైటీగా ఉంది కదా.. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు మదురైలో ఉన్న మునియాండి స్వామి దేవాలయంలో ఈ విచిత్ర సంప్రదాయం ఉంది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీని ప్రసాదంగా పంచడం ఈ దేవాలయంలో ఆచారం. ప్రతి ఏటా జనవరి 24 నుంచి జనవరి 26వరకు ఇక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతాయట. ఈ సందర్భంగా భక్తులకు బిర్యానీని పంచుతారట..

 

ఈ బిరియానీ ప్రసాదం వడ్డనకు భక్తులు పెద్ద ఎత్తున విరాళాలు కూడా అందజేస్తుంటారట. ఈ బిర్యానీ ప్రసాదం కోసం ఈ ఏడాది వెయ్యి కేజీల బియ్యం, 150 మేకలు, 3వందల కోళ్లను ఉపయోగించారట. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఏ మాత్రం వివక్ష లేకుండా ఈ బిర్యానీ ప్రసాదాన్ని అందించారట. కేవలం గుడిలోనే తినడం కాదు.. ఈ బిర్యానీ ప్రసాదాన్ని ఇంటికి పార్సిల్ కూడా తీసుకునే వెళ్లే సదుపాయం ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: