పంచముఖ ఆంజనేయ స్వామి వినే ఉంటారు క‌దా. పంచముఖి అంటే ఐదు ముఖాలు కలవాడు అని అందరికి తెలుసు. భారత దేశంలో కొన్ని చోట్ల మాత్రమె ఈ ఆలయాలు వున్నాయి. అయితే పంచముఖి ఆంజనేయస్వామిగా కొలిచే ఆ అవతారంలో  హనుమంతుడు, నరసింహుడు, గరుడుడు, వరాహుడు, హయగ్రీవుడు ఉంటారు.  హనుమంతుడు మై రావణుని సంహార సమయంలో ఈ పంచ ముఖి అవతారాన్ని ఎత్తాడు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి గురించి మనకు రామాయణం లో వివరణ కూడా దొరుకుతుంది.

 

అయితే ఈ పంచ‌ముఖ ఆంజ‌నేయ స్వామి ఫోటో ఇంట్లో ఉండ‌డం వ‌ల్ల ఎన్నో మంచి ఫ‌లితాలు క‌లుగుతాయి. అయిదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతం. అయిదు కర్మేంద్రియాలతో మనిషి ప్రపంచంలో మనుగడను సాధిస్తూ, అయిదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు. స్వామివారి పంచముఖాలలో ఒకో మోముదీ ఒకో రూపం. తూర్పున ఆంజనేయుని రూపం, దక్షిణాన నారసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహావతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ. 

 

అలాగే ఆ అయిదు ముఖాలు తన భక్తులను అయిదు రకాల అభయాన్ని అందిస్తూ ఉంటాయి. నారసింహ ముఖం విజయాన్ని, గరుడ రూపం దీర్ఘాయుష్షునీ, వరాహము అష్ట ఐశ్వర్యాలనీ, హయగ్రీవుడు జ్ఞానాన్నీ, ఆంజనేయ రూపం అభీష్టసిద్ధినీ కలుగచేస్తాయి. ఇంతటి శక్తిమంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుని పంచముఖ రూపంలోనే దర్శించారు. అందుకే ఖ‌చ్చితంగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోండి.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: