కలియుగంలో మనిష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్పస్వామి. అయ్యప్ప హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో శబరిమల ఒకటి. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే స్వామివారి దర్శనం లభిస్తుంది. శబరిమలలో కొలువున్న అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షలాది మంది భక్తులు దేశ, విదేశాల నుంచి తరలివస్తారు. 

 

అలాగే  అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి, నియమ నిష్టలతో 41 రోజులు దీక్ష చేస్తారు. అయ్యప్ప దీక్ష చాలా కఠినమైంది... ఎంతో భక్తి భావంతో కూడుకున్నది. నలభై రోజుల పాటు చేసే దీక్షలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. నేలమీద పడుకోవడం, చన్నీటి స్నానం, ఏకభుక్తం, పాదరక్షలు ధరించకపోవడం లాంటి కఠిన నియమాలు పాటిస్తారు. అయితే శబరిమలై అంటే అర్థం ఏంటి అన్న ప్ర‌శ్న మీకు వ‌చ్చే ఉంటుంది. శబరిమలై అంటే శబరి యొక్క పర్వతము అని అర్ధం. మహిషాసురుడి సోదరి మహిషిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. 

 

శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి.  కేరళ పశ్చిమ కొండ పర్వతప్రాంతాలలో కొలువై ఉన్న ఈ ఆలయానికి సమీపంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఉంది. మొత్తం 18 పర్వత శ్రేణుల మధ్య నెలకొన్న ఈ ప్రాంతాన్ని పూంకవనమ్ అని పిలుస్తారు. ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు మరియు కొండలతో కూడి ఉంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: