హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు.  దక్షిణ భారతములో ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకొందురు. ఇతర మాసములలోని సప్తమి తిథులకన్న మాఘమాసమందలి సప్తమి బాగా విశిష్టమైనది. 2020 వ సంవత్సరంలో రధ సప్తమి ఫిబ్రవరి1(నేడు) శనివారం నాడు వచ్చింది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభం తర్వాత  వచ్చే సప్తమి తిధి రథసప్తమి అని పేరు వచ్చింది.

 

అందుకే ఈరోజు పవిత్రదినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. అంతేకాదు.. మాఘశుద్ద సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. సకల జగత్తుకి వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన డిస నిర్దేశాన్ని మార్చుకునే రోజు. సూర్యుడు… సమస్త జగతికీ మూలాధారం. కాలానికి అధిపతి. ప్రత్యక్ష నారాయణుడిగా ప్రాణకోటికి వెలుగుతోపాటూ దర్శనమిచ్చే సూర్యభగవానుడిని పూజించేందుకు మేలైన రోజు రథసప్తమి. ఇక విజ్ఞానశాస్త్ర ప్రకారం చూస్తే సూర్యోదయ కాలంలో సూర్యుని ఎదురుగా నుంచుని స్నానం చేయడం వలన సౌరశక్తి లోని అతినీల లోహిత కిరణాలు మన శరీరానికి చాలా మంచిది.

 

లేత సూర్యకిరణాలలో సూర్య నమస్కారాలు చేయడం వెనుక ఉన్న శాస్త్రీయ కోణం ఇదే. అలాగే ఉరుకుల పరుగుల జీవితంలో యోగాన్ని అభ్యసించలేనివారి కోసం ఈ సూర్యనమస్కారాలను రూపొందించినట్లు పెద్దలు చెబుతారు. ఇక మెదడు ఎదుగదలలో లోపాల దగ్గర్నుంచీ డయాబెటిస్ వరకూ అనేక సమస్యలకు కారణం అవుతున్న విటమిన్ డి లోపం కూడా ఈ సూర్యనమస్కారాలు చేసే సమయంలో లభించడం ఖాయం. ఇన్ని విశిష్టతలు ఉన్న సూర్యభగవానునికి జన్మదినం అంటూ ఒక రోజుని ఏర్పాటు చేసుకోవడం తప్పేమీ కాదు కదా.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: