మేడారం జాతరకు వెళ్లాలంటే కారులో గంటల తరబడి ప్రయాణించాలి. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. హెలికాప్టర్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారంకు హెలికాప్టర్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

 

ఇక రేటు ఎంతంటే.. హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జీఎస్టీ ఉంటుంది. మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ వ్యూలో చూసేందుకు ప్రతి ప్రయాణికుడి వద్ద రూ. 2999 నామ మాత్రపు చార్జీ వసూలు చేస్తున్నారు. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయంను ఉపయేగించుకోవటానికి ఫోన్ నెంబర్ 94003 99999ని సంప్రదించాలని మంత్రి తెలిపారు.

 

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరను ప్రతీ ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయిస్తుంది. ఈ జాతర సంబరం చూడాలంటే రెండు కళ్లూ చాలవు. అందుకే కాస్త ఖర్చయినా హెలికాప్టర్ లో చూసి రండి. రెండేళ్లకోసారి ఈ జాతర వస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: