హనుమంతుడు సీతారాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అయ్యేది అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే సాధార‌ణంగా చాలామంది ఇళ్లల్లో హనుమాన్ యంత్రం ఉంటుంది.

 

శ్రీ హనుమాన్ యంత్రంలో ఆంజనేయుడు కొలువై ఉంటాడు. ఇది మహా శక్తివంతమైనది. శ్రీ హనుమాన్ యంత్రం ఇంట్లో ఉందంటే ఆంజనేయుని అండదండలు లభ్యమైనట్లే. సాక్షాత్తూ ఆంజనేయస్వామి కొలువై ఉండే ఈ యంత్రం వాహన ప్రమాదాల బారిన పడకుండా కాపాడుతుందని పురాణాలు చెబుతున్నాయి. పూజాగదిలో ఈ యంత్రాన్ని ఉంచి బయటికివెళ్లే సమయంలో ఈ యంత్రానికి నమస్కరించి రావడం వల్ల శుభం జరుగుతుందని నమ్మకం. 

 

ఈ యంత్రాన్ని ‘ఓం ఓం హ్రీం హ్రీం శ్రీ వాయుపుత్రాయ నమ:’ అనే మంత్రం పఠిస్తూ పూజించాలి. భూత, ప్రేత, పిశాచాల్లాంటి బాధలు, భయాల నుంచి బయటపడేందుకు ఆంజనేయస్వామిని పూజిస్తారు. బక్తుల మొర ఆలకించి కొండంత అండై ఉంటాడు. ఆదుకుని ఆపదలను తొలగిస్తాడు. హనుమంతునికి మంగళవారం ఇష్టమైన రోజు కనుక, శ్రీ హనుమాన్ యంత్రాన్ని మంగళవారం తెచ్చుకోవడం శ్రేయస్కరం. హనుమాన్ యంత్రాన్ని పూజా మందిరంలో ఉంచి ప్రార్ధించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: