కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువైన పుణ్యక్షేత్రం తిరుమల. అయితే ఈరోజు ఆ తిరుమల కొండపై ఓ ఘాటన జరిగింది. ఆ ఘటన చుసిన ప్రతి భక్తుడికి పీకలదాకా కోపం వచ్చేసింది. అసలు ఏం జరిగిందంటే.. తిరుమల కొండపై ఓ ఛార్టెడ్‌ విమానం హల్‌చల్‌ చేసింది. కేంద్రానికి సంబంధించిన సర్వే ఆఫ్‌ ఇండియా విమానం రెండు రోజులు పాటు తిరుమల కొండపై చక్కర్లు కొట్టింది. 

 

అయితే.. ఇప్పటికే తిరుమల కొండపై నో ఫ్లైయింగ్‌ జోన్‌ ప్రకటించారు. అయినప్పటికీ విమానం చక్కర్లు కొట్టడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కాగా ఆ విమానం కేంద్రానికి సంబంధించింది అని తెలియక అధికారులు కూడా ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఎస్‌వోఐకి చెందిన ఈ విమానం ప్రతి ఐదేళ్లకు ఓసారి దేశ భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చెయ్యడానికి సర్వ్ చేస్తుంది.. 

 

ఈ నేపథ్యంలోనే తిరుమల కొండపై విమానం గుర్తించిన తిరులమ విజిలెన్స్‌ అధికారులు చెన్నై ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు సమాచారం అందిస్తూ తిరుమల కొండపైకి విమానాలను వెళ్ళడానికి అనుమతి లేదు అని తెలిపినట్టు విజిలెన్స్‌ అధికారి తెలిపాడు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం తిరుమల కొండపై విమానాలు తిరగకూడదని అధికారులు తెలిపారు. అంతేకాదు తిరుమల కొండపై దేవతలు విహర్షితుంటారు అని భక్తుల నమ్మకం.  

మరింత సమాచారం తెలుసుకోండి: