ఫిబ్రవరి 9 ఆదివారం రోజు(నేడు) మాఘ పూర్ణిమ. మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ.  చైత్రాది పన్నెండు మాసాలకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం దీపాలకూ, దీపారాధనలకు ప్రసిద్ధి. మాఘమాసం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి. మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి.ఈ సమయంలో సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. 

 

'మఘం' అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు శ్రేష్ఠమైన మాసంగా దీనిని భావిస్తారు. ఇక మాఘ పౌర్ణమి విశేషాలు చాలా ఉన్నాయి. అందులో మాఘ‌ స్నానం ఒకటి. దీన్ని పవిత్రస్నానంగా భావించి, పాప పరిహారం కోసం నదీస్నానాలు చేయడం మాఘ సంప్రదాయం. మాఘస్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నానం వల్ల అందం, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్షుతోపాటు మంచితనం, ఉత్తమశీలం లభిస్తాయని పద్మ పురాణంలో పేర్కొన్నారు. అలాగే జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైన‌ది.

 

అలాగూ వేగంగా ప్రవహించే నీళ్లలో చేస్తే మరింత శ్రేష్ఠమని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. మాఘ స్నానాలకు అధిష్ఠానదేవత సూర్యనారాయణుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. సకల నదీ, నదాలు చివరకు సముద్రంతోనే సంగమిస్తాయి. కనుక, సముద్రస్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. ఇక మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహస్నానం వల్ల కూడా ఆరేళ్లపాటు చేసిన అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. బావినీటితో స్నానం వల్ల పన్నెండేళ్ల పుణ్యఫలం

 


 

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: