బ్రహ్మంగారు కాలజ్ఞానం గురించి ఎంతో మందికి తెలుసు. ఆయన చెప్పిన భవిష్యత్తు సత్యాలు ఎన్నో మనకళ్ళ ముందు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి కూడా. ఎన్నో వింతలు, ఎన్నెన్నో విడ్డూరాలు వర్తమానంలో కనిపిస్తున్నాయి. యుగాంతం ఎప్పుడు జరుగుతుంది అనే ప్రశ్నకి మాత్రం ఇప్పటికి కూడా సమాధానం దొరకలేదు. బ్రహ్మం గారి లెక్కల ప్రకారం యుగాంతం 2025 లో జరుగుతుందని అంటుంటారు. కానీ ఓ ఆలయం ఈ ధరిత్రి అంతం ఎప్పుడు జరుగుతుందో చెప్పకనే చెప్తోందట. ఆ ఆలయ చరిత్ర ప్రకారం చూస్తే అక్కడ ఉన్న చేప ఈదితే ఈ కలియుగం అర్ధంతరంగా ముగిసిపోతుందని అంటున్నారు...

 

ఏపీలో కడప జిల్లాలోని నందులూరులోని సౌమ్యనాధాలయం తనలో ఎంతో చరిత్రని భవిష్యత్తు ముఖ చిత్రాన్ని చెప్పకనే చెప్తుందట. దక్షిణ భారతదేశంలో ఉన్న సుప్రసిద్ధ ఆలయాలలో ఒకటి నందులూరులోని సౌమ్యనాధాలయం. ఈ ఆలయానికి తమిళనాడులో గల పురాతన ఆలయాలకి చారిత్రాత్మక సంభంధం ఉందని స్థల పురాణం చెప్తోంది. నారదుడు ఈ సౌమ్యనాధాలయాన్ని నేరుగా ప్రతిష్టించారని తెలుస్తోంది. 11 వ శతాబ్దంలో చోళరాజులు ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాన్ని తాళ్ళపాక అన్నమాచార్యులు వారు స్వయంగా వచ్చి దర్శించుకునే వారని తెలుస్తోంది. ఇలా ఎన్నో సంస్కృతి సంపదని  తనలో దాచుకున్న ఈ దేవాలం, భవిష్యత్తులో జరగబోయే పెను  విపత్తు గురించి కూడా చెప్తోందట..

 

ఆలయంలో ప్రవేశించిన తరువాత లోపల కుడ్యాలపై పై భాగంలో మత్య(చేప) ఆకారం ఒకటి దర్సనమిస్తుంది. కేవలం అక్కడ మత్య ఆకారాన్ని ఎందుకు చెక్కి ఉంచారు అనే విషయంపై స్పష్టత లేకపోయినా దానివెనుక మాత్రం ఓ రహస్యం ఉందని అంటుంటారు. అక్కడి వేద పండితులు చెప్పే విషయాల ప్రకారం భవిష్యత్తులో భారీ వరదలతో  ఈ ఆలయంలో లోపలి నీరు చేరుకుంటుందని, ఆ నీరు ఈ చేపని తాకిన వెంటనే ఆ చేపకి ప్రాణం వచ్చి నీటిలో ఈదుతుందని అప్పుడు ఈ కలియుగం అంతం అవుతుందని స్థల పురాణం చెప్తోందని అంటున్నారు. ఈ ఆలయానికి ఉన్న మరొక విశేషం ఏమింటే ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో మరొక ఆలయం ఉన్నట్లుగా స్వామి వారి మండపం కింద స్పష్టంగా కనిపిస్తుందట.

 

         

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: