స‌త్య‌హ‌రిశ్చంద్రుడు అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీవ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సన్నివేశం హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలను పెట్టి, ఎన్నెన్నో మలుపులను తిప్పింది. ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు. ఎవరున్నారు ? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. 

 

కానీ అక్కడ ఉన్న వశిష్ఠుడి బద్ధశత్రువు విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడుకాడు అని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని హరిశ్చంద్రుడితో ఎలాగైనా అబద్ధం ఆడిస్తానని అన్నాడు. ఆ త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో హ‌రిశ్చంద్రుడు భార్య‌ చంద్ర‌మ‌తికి రాజు రాజ‌దండ‌న విధిస్తారు. రాజభటుల ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజు ఆజ్ఞను హరిశ్చంద్రుడు అమలుపరిచాడు. 

 

అప్పుడు హ‌రిశ్చంద్రుడు ఖ‌డ్గం ఎత్తి చంద్ర‌మ‌తి శిర‌స్సును తెగేయాల‌ని చూడ‌గా.. ఆ ఖ‌డ్గం ఒక పూల‌దండ‌లా మారి చంద్ర‌మ‌తి మెడ‌లో ప‌డుతుంది. వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి రుషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. విశ్వామిత్రుడు ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చందృడిగా పేరు పొందాడు.

 

వాస్త‌వానికి ఈ దంప‌తుల‌ది ప్రేమ పెళ్లి త‌ర్వాత ఎలా ఉండాలో ప్ర‌పంచానికి చాటి చెప్పింది. పెళ్లి త‌ర్వాత ఎంత ప్రేమ‌గా ఉండాలో... ఎంతో అన్యోన్యంగా ఉండాలో అని ప్ర‌పంచంలో త‌రాలు మారినా.. యుగాలు మారినా.. కాలాలు మారినా వీరే ఆద‌ర్శంగా నిలిచారు. అందుకే స‌త్య హ‌రిశ్చంద్రుడి నాట‌కి ఎప్ప‌ట‌కీ చ‌రిత్ర‌లో ఇప్ప‌ట‌కీ ఎప్ప‌ట‌కీ అలా నిలిచిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: