కలియుగ ప్రత్యక్ష దైవం..కోట్లాది మంది భక్తుల కొంగుబంగారం  శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి గూర్చి ఎంత చెప్పినా తక్కువే. స్వామి యొక్క దివ్య రూపాన్ని చూడాలని కోట్లాది మంది భక్తులు ప్రపంచ నలుమూల నుంచీ తరలి వస్తుంటారు. కొందరు తీరిన కోర్కెల  మొక్కులు చెల్లించుకోవడానికి , మరికొందరు కోర్కెలు తీర్చమని వేడుకోవడానికి ఇలా ప్రతీ ఒక్కరి సాధక భాధలు వెంకన్న స్వామికి విన్నవించుకుంటారు. స్వామి వారి నిండైన రూపాన్ని  చూడగానే ఒళ్ళు జలజరించని వ్యక్తి ఉండరంటే అతిశయోక్తి కాదు. స్వామిని చూసి తరించిన వెంటంటే కలిగే అనుభూతి, ప్రశాంతత కోట్లు పెట్టినా దొరకదు. అలాంటి స్వామి వారికి  నిత్యం ఎన్నో  కైంకర్యాలు  జరుగుతూ ఉంటాయి..ఈ సేవలలో పాల్గొన డానికి కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే తిరుమల తిరుపతిలో గురువారం నాడు మాత్రం రెండు అద్భుతమైన సేవలు జరుగుతాయి..ఈ సేవలతో పాటుగానే ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంటుంది..అదేంటంటే..

Image result for poolangi seva

గురువారం నాడు సడలింపు, తిరుప్పావడ, పూలంగి, అభిషేకం. వంటి విశేష సేవలు జరుగుతాయి. ఈ క్రమంలోనే స్వామి వారికి రోజు వారి సేవలు జరిగిన తరువాత తలుపులు వేసి స్వామి వారి ఆభరణాలు తీసేస్తారు. ఆ తరువాత  కన్నులని సైతం కప్పి ఉంచే కర్పూర పెద్ద తిరు నామాన్నితగ్గించి సన్నగా మార్చుతారు..దాంతో స్వామీ వారి కమలములాంటి కన్నులు ఎంతో అద్భుతంగా దర్సనమిస్తాయి భక్తులకి. ఆ తరువాత స్వామీ వారిని కేవలం పూలతో పూర్తిగా అలంకరిస్తారు. ఈ పూలంగి సేవలో స్వామిని చూడటానికి రెండు కళ్ళూ చాలవు..ఆ తరువాత తిరుప్పావడ సేవలో భాగంగా స్వామీ వారికి 450 కేజీల పులిహోర అలాగే పాయసం, వడ నైవేద్యంగా పెడుతారు.. పూలంగి సేవ అనంతరం అక్కడ జరిగే ఆశ్చర్య కరమైన సంఘటన ఏమిటంటే..

Image result for nijaroopa darshanam

గురువారపు రోజున స్వామి వారి నిజరూప దర్సనం జరుగుతుంది  కాబట్టి తిరుమల కొండపై ఉండే ప్రతీ అధికారి స్వామి వారిని క్షమించమని మొక్కుకుంటారట. ఎందుకంటే నిజరూప దర్సనం రోజున స్వామి వారి నేత్ర దర్సనం జరుగుతుంది కాబట్టి ఆ రోజు ఎవరు ఏ తప్పు చేసినా సరే స్వామి వారు శిక్షిస్తారు అనేది వారి నమ్మకం. అంతేకాదు గురువారం రోజున తిరుమల కొండని జీవన ఆధారంగా చేసుకుని వ్యాపారాలు చేసుకునే వారు సైతం ఆ ఒక్క రోజు మాత్రం లాభాపేక్ష లేకుండా భక్తులని దోచుకోకుండా వస్తువులు అమ్ముతారట. వారంతరం వ్యాపారాలు ఎలా చేసినా సరే ఒక్క గురువారం రోజు మాత్రం ఉద్యోగులు, వ్యాపారస్తులు నిజాయితీగా ఉంటారని అంటుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: