తిరుమలలోని శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. అధికారులు చంద్రగిరి మండలం శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతపులి సంచరిస్తున్నట్టు చెబుతున్నారు. చిరుత 270వ మెట్టు దగ్గర దుప్పిని చంపి తినటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. శ్రీవారి మెట్లపై రక్తపు మరకలను, దుప్పిని చూసిన భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. భక్తులు సమాచారం అందించటంతో అధికారులు వెంటనే అప్రమత్తమై దుప్పిని తొలగించారు. 
 
చిరుత సంచారం గురించి తెలియడంతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు ముందు జాగ్రత్తగా కొంత సమయం పాటు భక్తులను అనుమతించలేదు. ఆ తరువాత అధికారులు భద్రతను కట్టుదిట్టం చేసి నడక మార్గంలో వెళ్లే భక్తులకు అనుమతి ఇచ్చారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. అధికారులు ఇది చిరుత పనా...? లేక రేసు కుక్కల పనా...? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. 
 
టీటీడీ విజిలెన్స్ అధికారులు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. తిరుమలకు భక్తులు వెళ్లటానికి రోడ్డు మార్గం మరియు రెండు మార్గాలు ఉన్నాయి. శ్రీవారి మెట్ల మార్గం, అలిపిరి మెట్టు మార్గం ముఖ్యమైనవి.తిరుమలకు నడక మార్గంలో వెళ్లే భక్తులు మెట్టు, అలిపిరి మార్గాల ద్వారా వెళ్లి తిరుమలకు బయలుదేరతారు. అలిపిరి మార్గంలో ఉన్న మెట్ల సంఖ్య కన్నా శ్రీవారి మెట్టు మార్గంలో ఉన్న మెట్లు చాలా తక్కువ. అందువలన భక్తులు శ్రీవారి మెట్ల మార్గం మార్గం ద్వారా వెళ్లటానికి ఎక్కువగా ఇష్టపడతారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: