తమిళనాడు రాష్ట్రంలోని, రామేశ్వరం ద్వీపంలో ఉన్న ప్రసిద్ధ హిందూ శైవ క్షేత్రం రామనాథస్వామి లింగం. 275 పాడల్ పేత్ర స్థలములలో ఒకటిగా ఉంది ఈ దేవాలయం. ప్రసిద్ధ భక్తులైన "నాయనార్లు", అప్పార్లు, సుందరార్లు అంరియు తిరుగ్నాన సంబందార్లు తమ కీర్తనలతో ఆ దేవాలయ మహిమలను ఆ నాడు కీర్తించారు. 12 వ శతాబ్దంలో పాండ్య రాజ్యంలో ఈ దేవాలయాన్ని విస్తరించారు. 

 

భారతదేశంలోని హిందూ దేవాలయాల కంటే అతిపెద్ద వరండా కలిగి ఉన్న దేవాలయం ఇది. ఈ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటిగా ఉంది. ఇతిహాసాల ప్రకారం చూస్తే, రామాయణంలో రాముడు విష్ణువు ఏడవ అవతారం. రామేశ్వరంలో శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధి నేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని అంటారు. రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం తొలగించుకోవడానికి రామేశ్వర౦లో లింగ ప్రతిష్ఠ చేయాలను కుంటాడు.

 

దీనితో రాముడు శివుణ్ణి కొలవడానికి గానూ, పెద్ద లింగాన్ని ప్రతిష్టించాలని భావించి, హనుమంతుడుని హిమాలయాల నుండి లింగాన్ని తేవలసినదిగా ఆదేశిస్తాడు. అయితే హనుమంతుడు తీసుకొచ్చే లోపే కాలాతీతం అయినందున రాముని భార్య సీత చిన్న లింగాన్ని తయరుచేసి తెస్తుంది. ఈ లింగమే గోపురంలో కొలువ బడుతున్నదని భక్తుల నమ్మకం. ఈ లింగాన్ని రామనాథేశ్వర స్వామిగా అప్పుడు రాముడు ప్రతిష్ఠించాడు రాముడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్తలంగా భాసిల్లుతుంది. విశాలాక్షి,పర్వతవర్ధిని,ఉత్సవ విగ్రహం,శయన గృహం పెరుమాళ్, మొహానపతి విగ్రహాలు విడివిడిగా ప్రతిష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: