భీమశంకర క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. భీమశంకర క్షేత్రం సహ్యాద్రి పర్వత సానువుల్లో మహారాష్ట్రలో పూణేకు 127 కి.మీ. ముంబాయికి 200 కి.మీ. దూరంలో, పూణే జిల్లాలోని ఖేడ్ తాలుకాలో భీమా నది ప్రక్కన భావగిరి గ్రామంలో ఉంది. భీముడు అనే రాక్షసుడి కారణంగా తలెత్తిన వివత్తును తొలిగించి నందువల్ల ఆ భీమశంకర జ్యోతిర్లింగంగా ఈ దేవాలయం నిర్మించారు. కృష్ణా నది యొక్క ఉపానది అయిన భీమానది ఇక్కడే పుట్టింది. కృష్ణా నది పుట్టిన చోట శివలింగం ప్రక్కభాగం నుంచి కొద్ది కొద్దిగా ప్రవహిస్తూంటుంది.

 

సహ్యాద్రి పర్వత శిఖరాలలో ఒకదాని పేరు డాకిని. ఆ కొండపై భాగంలో పరమశివుడు భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిశాడు. భీమశంకర్ దేవాలయాన్ని 13 వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పీష్వాల దీవాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. గుడి గోపురాన్ని చూడగానే ఏదో తెలియని అనుభూతి కలుగుతుందని భక్తులు అంటున్నారు. గుడి లోపల చిన్నగా వున్నా ఆ శివలింగాన్ని వెండితో తాపడం చేసారు. దాని పైన ఒక కత్తి గాటు ఉంటుంది. లోయలో ఉండే అతి కొద్ది ఆలయాల్లో భీమాశంకర్ ఒకటి అన్ని జ్యోతిర్లింగ క్షేత్రాల్లాగే భీమాశంకర్ గర్భ గుడి కూడా ఉంటుంది. 

 

క్రీ.శ.1437 లో చిమన్జీ అంతజీ నాయక్ అనే అతను స్వామి ముందుర ఉన్నసభా మండపాన్ని తనకు తాను గా నిర్మించాడు. రఘునాథ్ పీష్వా అనే అతను ఒక నూతిని తవ్వించారు. ఆ కోనేటి లోపల ఒక వినాయకుడి విగ్రహం కుడా వుంది.ఈ జ్యోతిర్లింగ క్షేత్రం భూమికంటే చాలా దిగువన ఉంటుంది. ఎన్నో ఆలయాలు పర్వత శిఖరాల పైన వుంటాయి. కాని ఈ  ఆలయాము కిందికి ఉంటుంది. మెట్ల మార్గ౦ ద్వారా ఈ క్షేత్రానికి వెళ్ళాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: