స్వామి అయ్యప్పని ఆరాధించే ప్రసిద్ద పుణ్యక్షేత్రం శబరిమల లో ఉన్న అయ్యప్ప గుడి. ప్రతి సంవత్సరం, స్వామి వారి ఆశీస్సులు పొందడానికి భక్త జన సమూహం ఇక్కడికి తరలి వస్తారు. అయ్య‌ప్ప‌ను హరిహరసుతుడని, ధర్మశాస్త, మణికంఠుడని కూడా పిలుస్తారు.  మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. అయితే బ్రహ్మచారి అయిన అయప్పను వివాహం చేసుకోవాలని ఒక దేవత చాలా కాలంగా వేచి చూస్తోంది. ఆమెకు కూడా ఒక చిన్న దేవాలయం కూడా ఉంది.

 

మ‌రి ఆమె ఎవ‌రు..? ఆమె దేవాల‌యం ఎక్క‌డ ఉంది..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మచారి అయిన మణికంఠుడిని వివాహం చేసుకోవాలనుకొన్నది మల్లికాపురథమ్మ. ఆమెకు సంబంధించిన ఒక కథనం ప్రచారంలో ఉంది. పందల రాజు తనకు దొరికిన అయ్యప్పను కలరి విద్య నేర్చుకోవడం కోసం ఓ విద్యాలయంలో శిష్యునిగా చేరుస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి వెనుకకు వచ్చిన అయ్యప్పకు రాజ్యపట్టాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి. 

 

అయితే ఆ గురుకులం గురువు కుమార్తే లిలా అయప్పను ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ, బ్రహ్మచర్యంలో ఉన్న అయ్యప్పస్వామి ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు. మ‌రియు ఎప్పుడైతే శబరిమలెకు కన్నెస్వాముల రాక ఉండదో ఆ రోజు ఆమెను పెళ్లి చేసుకొంటానని మాట ఇస్తాడు. దీంతో ఆ దేవత కన్యస్వాములు వస్తున్నారో రారో చూడటం కోసం శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే మల్లికాపురథమ్మ పేరుతో వెలిసిందని చెబుతారు. అయ్య‌ప్ప పుణ్యక్షేత్రానికి వెళ్లిన‌ప్పుడు ఈ ఆలయన్ని మనం చూడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: