మహారాష్ట్రలో ఔరంగాబాద్ సమీపంలో ఘృష్ణేశ్వరం మహదేవ్ అనే ఆలయం ఉంది. దీనిని దేవి అహల్యాబాయి హోల్కర్ నిర్మాణం చేపట్టారు. దౌలతబాద్ నుండి 15 కి. మి. మరియు ఔరంగాబాద్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ఘృష్ణేశ్వరం మహదేవ్ ఆలయం భూమిపై చివరి లేదా 12 వ (పన్నెండవ) జ్యోతిర్లింగ౦గా భక్తులు నమ్ముతారు. బౌద్ధ సన్యాసుల ఎల్లోరా ఆలయం ప్రసిద్ధ గుహలు ఈ దేవలాయం సమీపంలో ఉన్నాయి. 

 

ఔరంగబాద్‌ జిల్లా, వేరూల్‌ గ్రామంలో శివాలయ తీర్థం సమీపంలో వెలిసిన ఈ జ్యోతిర్లింగాన్ని ఎంతో ఆదరణ ఉంది. జ్యోతిర్లింగా ఆఖరిది అయిన ఘృశ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని బలంగా నమ్ముతారు భక్తులు. శివలింగం ఎక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ ఉందని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. కామ్యక వనంలో ఒకరోజు శివుడు, పార్వతి ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేయడంతో, అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడని చెప్తూ ఉంటారు.

 

ఆ తర్వాత అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేరుగాంచింది. పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారు అయిందని చెప్తారు. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్ఠించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది. పార్వతిమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టి దీనికి ఇంతటి మహత్తు ఏర్పడింది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: