భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్రక్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి. అయితే వీటిలో శివుడు ప్రతిష్ఠితమై ఉన్న వారణాశి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతొ పునీతమైందని చెప్తారు. జ‌రాసంద్రుడు  బారినుండి  త‌ప్పించు కునేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైందిగా చెప్తారు. ఈ మందిరాన్ని పదో శతాబ్దంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. 

 

శ్రీకృష్ణుని మనుమడు అయిన వజ్రనాధుడు ఈ మందిరాన్ని మొట్టమొదటి సారిగా నిర్మించినట్ట్లు పురాణాలలో ప్రస్తావించారు. శ్రీకృష్ణుని ద్వారకా నగరం సముద్రగర్బంలో ఇంకా వుందని పరిశోధకులు అభిప్రాయపడుతూ ఉంటారు. నాగేశ్వర లింగము ద్వాదశ జ్యోతిర్లింగాలలో 10వది "నాగేశ్వర లింగము". గుజరాత్ రాష్ట్రంలో ద్వారక నుంచి గోపితలావ్ వెళ్లే బస్సులో నాగనాధ్ వద్ద దిగి వెళ్ళాల్సి ఉంటుంది. గోమతి ద్వారక నుంచి సుమారు 14 కి.మీ. దూర౦ ఉంటుంది సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు.

 

సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనములో వెళ్తుండగా... తారకుని అనుచరులు సుప్రియుడును, అతని సిబ్బందిని బంధించుకుపోయి, కారాగారములో ఉంచుతారు. మహా భక్తుడైన, సుప్రియుడు శివలింగధారి, మెడలో ఉన్న లింగమును తీసి, అరచేతిలో పెట్టుకుని పూజ చేస్తుండగా దానిని చూసిన రాక్షసుడి సేవకులు, తారకాసురునికి చెప్పడంతో, తారకాసురుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయడంతో, తారకాసురుడు కోప౦ పట్టలేక తన చేతిలో ఉండే గదతో తలపై  కొడుతుండగా, శంకరుడు అక్కడే జ్యోతి రూపమున ఆవిర్భవించి, తారకుని సంహరించెను. సుప్రియుడు కోరికపై దారుకా వనమునందే "నాగలింగేశ్వర" నామముతో లింగరూపము ధరిస్తాడు. ఈ ప్రాంతంలో పూర్వ కాలంలో నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: