శివుడు లింగాకృతిలో స్వర్గ మర్త్య పాతాళాల్లో ఉద్భవించిన పర్వదినం మహాశివరాత్రి. మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఇది ప్రతి ఏడాదీ మాఘ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశినాడు అర్ధరాత్రి వేళ సంభవిస్తుంది. ఈ రాత్రి జగత్తు అంతటికీ ఆరాధ్య వేళ. పుణ్యాల పంట.

 

 

మరి మహాశివరాత్రి రోజు ఇవి తప్పక పఠించాలని పెద్దలు చెబుతారు. పూజా సమయంలో

ఏ మంత్రాలో పఠించాలో తెలుసుకునే ముందు.. అసలు శివరాత్రి రోజు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసి పూజా మందిరమును ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి తోరణాలు పూజామందిరాన్ని ముగ్గులు రకరకాల పుష్పాలతో అలంకరించుకోవాలి.

 

 

తెలుపు రంగు బట్టలను ధరించి శివుని పటాలు లింగాకార ప్రతిమలకు పసుపు కుంకుమలు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి. మారేడు దళములు, తెల్లపూల మాలతో భోళాశంకరుడి అలంకరించి అరటి, జామకాయ మొదలగు పండ్లను నైవేద్యంగా సమర్పించి నిష్టతో పూజించాలి. శివ అష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.

 

 

అదే విధంగా నిష్ఠతో ఉపవాసముండి శివ సహస్ర నామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసే వారికి మరు జన్మంటూ లేదని శాస్త్రాలు చెబుతున్నాయి. శివరాత్రి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం ఆరుగంటల వరకు శివపరమాత్మ స్తోత్రములతో ఆయన పూజ చేసిన వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని పెద్దలు అంటారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: