తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో శ్రీవారి ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. టీటీడీ ఈ నెల 12వ తేదీన భక్తులకు కళ్యాణం లడ్డూను అందుబాటులోకి తీసుకొనిరాగా ఈరోజు నుండి వడ ప్రసాదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే టీటీడీ భక్తులకు అవసరమైనన్ని వడలను అందుబాటులోకి తెచ్చింది. 
 
టీటీడీ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు 10 వేల వడ ప్రసాదం, 10 వేల కళ్యాణం లడ్డూలు అందించటానికి టీటీడీ సిద్ధం అవుతున్నట్టు తెలిపారు. సామాన్య భక్తులకు టీటీడీ ఎటువంటి సిఫారసు లేఖలు లేకుండా కళ్యాణం లడ్డూలను అందిస్తోంది. కళ్యాణం లడ్డూ ధర 200 రూపాయలు. 
 
టీటీడీ లడ్డూ ప్రధాన విక్రయ కేంద్రంలో రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి కళ్యాణం లడ్డూ విక్రయాలను ప్రారంభించింది. కౌంటర్లలో చిన్న లడ్డూలతో పాటు కళ్యాణోత్సవ లడ్డూలను కూడా విక్రయిస్తున్నారు. టీటీడీ కళ్యాణం లడ్డూలను, వడ ప్రసాదాలను సామాన్య భక్తులకు అందుబాటులోకి తీసుకొనిరావడంపై శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వడ ప్రసాదం సిఫారసు లేఖలు పొందగలిగిన వారికి, ఆర్జిత సేవల్లో పాల్గొనే వారికి మాత్రమే లభించేది. టీటీడీ ఒక్కో వడను 100 రూపాయల చొప్పున సిఫారసులతో పని లేకుండా విక్రయించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: