మనం ఎన్నో శైవక్షేత్రాలు చూసి ఉంటాం. ఎక్కువ క్షేత్రాలలో శివుడి లింగ స్వరూపుడిగా దర్శనమిస్తాడు. కాని, కొన్ని అరుదైన క్షేత్రాలలో మాత్రం లింగం ఆకారంతో పాటుగా కొన్ని చిహ్నాలతో దర్శమిస్తాడు. అలాంటి ఒక అరుదైన క్షేత్రం, అక్కడి స్థల పురాణ విశేషాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలోని, జగ్గం పేటకు దగ్గరలో ఉన్న కడలి అనే గ్రామంలో శైవ క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో శివుడు, లింగశ్వరూపుడిగా దర్శనం ఇస్తాడు. ఈ లింగాకారం యొక్క విశిష్టత ఏమిటంటే.. ఇక్కడి శివలింగం  మీద పావురాల తల, రెక్కలు కలిగి    ఉంటాయి. అంతేకాదు ఇక్కడ శివుడు స్వయంబుడై వెలిశాడని ప్రసిధ్ధి. అసలు ఈ శివలింగంపై పావురాల తల , రెక్కలు ఎలా వచ్ఛాయి అనడానికి ఓ పురాణగాధ ప్రాచుర్యంలో ఉంది...

 

పూర్వం ఈ కడలి గ్రామానికి దగ్గరగా ఉన్న ఒక అరణ్యంలో ఓ పావురాల జంట నివసించేది. అదే అరణ్యానికి ఓ వేటగాడు తల్లితండ్రుల ఆకలి తీర్చడానికి ఒకరోజు వేటకి వెళ్ళాడు. అదే సమయానికి కుండపోతగా వర్షం కూడా వస్తోంది. దానితో ఆ వేటగాడు, ఆ పావురాలు కాపురం ఉండే చెట్టుకింద తలదాచుకున్నాడు. తల్లితండ్రుల ఆకలి తీర్చలేని నాలాంటి కొడుకు బతికున్న వ్యర్ధమే అనుకొని తనలో తనే బాధ పడుతున్నాడు. ఇదంతా గమనిస్తున్న ఆ పావురాల జంట..

 

వాళ్ళ గూడులోని ఎండుపుల్లలను ఒక చోట పోగు చేసి,దగ్గరలోని స్మశానంలో కాలుతున్న నిప్పును తెచ్చి మంట  చేశాయి. ఆ వేటగాడి చలిని తగ్గించాయి. అయితే, వాళ్ళ గూటికి వచ్చిన ఆ వేటగాడిని అతిథిగా భావించి, మంటల్లోకి దూకి ప్రాణత్యాగం చేసి ఆ వేటగాడి ఆకలి తిర్చాయి. ఆ పావురాల జంట యొక్క ఔదార్యానికి ఆ వేటగాడు చలించిపోయి, వారి త్యాగం ముందు నేను ఏపాటి వాడను అనుకొని అతను కూడా ఆ మంటల్లోకి దూకి ప్రాణ త్యాగం చేస్తాడు. ఇంతటి త్యాగానికి పూనుకున్న పావురాల జంటకు పరమశివుడు, దర్శనమిచ్చి వరమును కోరుకోమనేను...

 

దానికి ఆ పావురాలు వేటగాడిని బతికించమని, ఇంకా వారి ప్రాణత్యాగానికి గుర్తుగా ఆ మహాశివుడిని అక్కడ కొలువుతీరమని వేడుకోవడంతో. ఆ త్యాగానికి ముగ్ధుడైన శివుడు ఆ పావురం జంటను తనలో మమేకం చేసుకొని, వారి రూపాలతో సహా ఇక్కడ కొలువు తీరాడాని ప్రతీతి. ఇక్కడే ఉన్న ఈ శివాలయ కొలనును కపోత గుండముగా పిలుస్తారు.

 

మాఘమాసంలో  ఆదివారం ఇక్కడ కాశీ లోని గంగానది అంతర్వానిగా ప్రవహిస్తుందని, ఆ రోజు ఈ కపోతగుండంలో మారేడు పత్రాలు వేసిన అవి తీలియాడకుండా, మునిగిపోతాయని ఇక్కడ ప్రజల విశ్వాసం.  ఆ రోజు కపోతగుండంలో స్నానమాచరించి, కపోతేశ్వరుని దర్శనం చేసుకున్న వారికి సర్వపాపాలు తొలిగి కోరిన కోర్కెలు తీరుతాయని ప్రసిధ్ధి.

మరింత సమాచారం తెలుసుకోండి: