నేడు మహాశివరాత్రి.. ఈ శివరాత్రి సందర్భంగా హర హర మహాదేవ గురించి ఓ రహస్యం మీకోసం.. హిందువులు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకునే ఈ పండుగాకు సంబంధించిన రహస్యం.. పరమశివుడుకు ఎన్ని పేర్లు ఉన్నాయి? అదేం ప్రశ్న? ఎన్నో పేర్లు ఉన్నాయి అని అంటారు కదా.. అవును.. ఆ మహాదేవుడుకు ఎన్నో పేర్లు ఉన్నాయి.. 

 

భోళాశంకరుడు... పరమ శివుడు... హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అఘోర, నీలకంఠుడు.. ఇలా అయన పేర్లు చెప్పుకుంటూ వెళ్తే చదువుతూనే ఉంటాం. అలాంటి పరమశివుడుకు నీలకంఠుడు అని పేరు ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది ? అసలు ఎందుకు వచ్చింది అనే దానిపై మీకు ఎప్పుడు సందేహం రాలేదా? 

 

ఇంకా కథలోకి వెళ్తే.. ఆ రోజు.. దేవతలకు.. అసురులకు పోటాపోటీ నెలకొంది. వారు ఇద్దరు అటు ఓ వైపు.. ఇటు ఓ వైపు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు, అలా జరిపిన సమయంలోనే ముందు గరళం వచ్చింది. లోకం నాశనం అవ్వకుండా శాంతంగా ఉండాలని శివుడు ఆ గరళాన్ని మింగుతాడు. 

 

అయితే శివుడు మింగిన గరళాన్ని శరీరంలోకి వెళ్లకుండా పార్వతిదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపేసింది.. అప్పుడు శివుడు కంఠం నీలం రంగులోకి మారిపోయింది. దీంతో అప్పుడే శివుడు నీలకంఠుడుగా మారాడు. ఇక పోతే శివుడు మింగిన గరళం గొంతులోనే ఉండాలి.. శివుడు పడుకున్న ఆ గరళం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంది అని.. శివుడుకు నిద్ర రాకుండా దేవతలు.. అసురులు అందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడారు. 

 

ఆ రోజే మాఘ బహుళ చతుర్దశి. వారు ఆడిపాడిన ఐదు జాముల కాలాన్ని 'మహాశివరాత్రి' అని పిలుస్తారు. ఇక ఆ రోజు నుండి శివ భక్తులు శివుడు కోసం ఉపవాసం, జాగారణతో శివారాధన చేస్తున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆరోజు శివపార్వతుల కళ్యాణం, శివలింగోద్భవం కూడా జరిగింది. అలా.. ఈ మహాశివరాత్రి వచ్చింది. ఇక అలానే శివుడును నీలకంఠుడుగా పిలవడం ప్రారంభించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: