శివ అంటే ఆది గురువు అని అర్థం. అలాంటి ఆది గురువుకి వివాహం జరిగిన రోజు, ఆది గురువు లింగాకారంలో ఆవిర్భవించిన రోజును హిందువులు ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. అదే మహా శివరాత్రి..! ఇక‌ శివరాత్రి రోజున శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ప్రతినెలలోనూ అమావాస్య ముందువచ్చే చతుర్ధశి నాడు శివునికి అత్యంత ప్రీతిపాత్రమయినరోజు. దానినే మాస శివరాత్రి అంటారు. అయితే మాఘమాసములో వచ్చేదాన్ని మాత్రం మహాశివరాత్రి అనిపిలుస్తారు. ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. 

 

ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఉత్తర భారతదేశంలో విష్ణు దేవాలయాల కంటే శివాలయాలే ఎక్కువ.. ఇక కాశీలో కూడా శివుని దేవాలయం ఎంతో ప్రసిద్ది ..వారణాసికి వెళ్లి శివరాత్రి జరుపుకునే వారు లక్షల మంది ఉంటారు. అలాగే ఒక్కో చోట ఒక్కోలా మ‌హాశివ‌రాత్రి జ‌రుపుకుంటారు. మ‌రియు  బంగ్లాదేశ్‌లోనూ మహా శివరాత్రి వేడ‌క‌లు ఎంతో ఘ‌నంగా నిర్వ‌హిస్తారు.

 

బంగ్లాదేశ్‌లో హిందువులు మహా శివరాత్రిని ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. వారు శివుని దివ్య వరం పొందడానికి ఉపవాశం కూడా ఉంటారు. బంగ్లాదేశ్ హిందువులు ఈ ప్రత్యేక రోజు పాటించడానికి చంద్రనాధ్ ధామ్ (చిట్టగాంగ్) వెళ్తారు. బంగ్లాదేశ్ లోని హిందువులంద‌రూ మహా శివరాత్రి రోజు చాలా ప్రముఖంగా జరుపుకుంటారు. ఈ రోజున ఉప‌వాసం మరియు పూజ చేయ‌డం వ‌ల్ల‌.. వాళ్ల‌కు మంచి భర్త లేదా భార్యను పొందుతార‌ని  అక్క‌డ హిందువుల న‌మ్మ‌కం.

మరింత సమాచారం తెలుసుకోండి: