శ్రీ‌శైల మ‌ల్ల‌న్న అభిషేక ప్రియుడు. పూలు, ఫ‌లాలు, పంచామృతం అవ‌స‌ర‌మే లేదు. కాసిన్ని నీటితో అభిషేకించినా మురిసిపోయి త‌మ‌ను అనుగ్ర‌హిస్తాడ‌ని భ‌క్తులు విశ్వ‌సిస్తారు. శ్రీ‌శైలానికి వ‌చ్చిన భ‌క్తులు స్వామివారికి అభిషేకం చేయించేందుకు పోటీ ప‌డ‌తారు. శివునికి ఇష్ట‌మైన సోమ‌వారంతోపాటు ప్ర‌త్యేక ప‌ర్వ‌దినాల్లో లింగ స్వ‌రూపుడిని అభిషేకిస్తారు. శ్రీ‌శైలంలో మ‌ల్ల‌న్న అభిషేకానికి 50 ఏళ్ల క్రితం టికెట్టు ప‌ది పైస‌లు మాత్ర‌మే ఉండేది. ప్ర‌స్తుతం రూ5 వేలు వెచ్చిస్తేగానీ మ‌ల్ల‌న్న ముందు కూర్చుని అభిషేకించు కోలేని ప‌రిస్థితి అయినా స‌రే భ‌క్తులు వెన‌కాడ‌డం లేదు. అభిషేకంలో వినియోగించే వ‌స్తువులు, వాటితో వ‌చ్చే ఫ‌లితాల గురించి శాస్త్రాల్లో వివ‌రించారు. ఆ వివ‌రాలు... 

 

అభిషేక ఫ‌లితాలు...


పాలు-దు:ఖ నాశ‌నం, పెరుగు-ఆరోగ్యం, నెయ్యి-గుణ‌వంతులు, తేజోవంతులు, అయిన సంతానం సంచ‌దా- బుద్ధావికాసం, చెరుకు ర‌సం-ఆనందం, కొబ్బ‌రి నీళ్లు-ధ‌న‌వృద్ధి, భ‌స్మ‌జ‌లం-మ‌హాపాప‌నాశ‌నం, ప‌న్నీరు-దేహ‌పుష్టి, అవిస‌నూనె, విప్ప‌నూనె, నువ్వుల‌నూనె-శ‌త్రునాశ‌నం, రాజ్య‌లాభం. పుష్పోద‌కం-భూలాభం, బిల్వ‌ద‌శ‌జ‌లం-భోగ‌భాగ్యాలు, సువ‌ర్ణ‌జ‌లం-దారిద్య్ర‌నాశ‌నం, ద్రాక్ష‌పండ్ల‌ర‌సం:ధ‌న‌ప్రాప్తి, ఖ‌ర్జూర జ‌లం- సుఖ‌జీవ‌నం, నేరేడు పండ్ల ర‌సం-స‌క‌ల జ‌యాలు, క‌స్తూరి జ‌లం-శ‌త్రుహాని నివార‌ణ‌, మామిడిపండ్ల ర‌సం-ధ‌న ధాన్య‌, గృహ ప్రాప్తి, న‌వ‌ర‌త్నాజ‌లం- చ‌క్ర‌వ‌ర్తిత్వం, గంగాజ‌లం-మోక్షం, సుగంధ ప‌రిమ‌ళ జ‌లం- భోగ‌ప్రాప్తి. శుద్ధ జ‌లం- స‌ర్వ‌పాప‌హ‌రం

మరింత సమాచారం తెలుసుకోండి: