మహా శివరాత్రి నాడు వెలిగించే దీపం గురించి తెలుసుకుందాం... పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి  ప్రత్యేకమైన రోజు ఈ మహాశివరాత్రి. ఈ రోజున సంకల్ప దీపంను మన సమస్యలకు తగ్గట్టుగా ఆ దీపాలను వెలిగించుకోవటం వలన మనకున్న సమస్యలు తొలగిపోతాయి. ఈ దీపాలు ఎప్పుడు వెలిగించాలి అంటే మహా శివరాత్రి రోజు మాత్రమే ప్రత్యేకంగా వెలిగించుకోవాలి. అలాగే దీంతోపాటు ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రి రోజు కూడా  దీపాన్ని వెలిగించుకోవచ్చు. 

 

 

అయితే మహాశివరాత్రి నాడు, మాస శివరాత్రి నాడు వెలిగించే దీపాలు ఇంట్లో వెలిగించుకోవచ్చు. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో అంటే మనం బాగా విపరీతంగా ఒక సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు   అమావాస్య రోజు దీపాన్ని వెలిగించవచ్చు. అమావాస్య రోజు వెలిగించే దీపం మాత్రం కచ్చితంగా శివాలయ ప్రాంగణంలో మాత్రమే వెలిగించాలి. 

 

దీనికోసం శివరాత్రి నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఆవు పంచకం చల్లుకొని ఇల్లంతా ఆవు పిడకలతో దూపం వేసుకోవాలి. ఇంట్లో ఈశాన్యం మూల ఆవుపేడతో అలికి  బియ్యం పిండితో ముగ్గు వేయండి. ఆ ముగ్గు మధ్యభాగంలో మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరి పేర్లు చెప్పుకుంటూ 3 సార్లు గుప్పెట్లో నవధాన్యాలు ఆ ముగ్గు మధ్యలో వేయండి. అలా నవదాన్యాలు పోసిన అనంతరం నల్లని ప్రమిద మధ్యలో పెట్టండి. ప్రమిదను మట్టి ప్రమిదలు వాడండి. ఈ సంకల్ప దీపం వెలిగించాలి అనుకుంటే కచ్చితంగా ఇవన్నీ పాటించాలి దీపారాధనకు మాత్రం నువ్వుల నూనె వాడండి ఇప్పుడు దీపం వెలిగించపోయేటప్పుడు ప్రత్యేకంగా వత్తుల గురించి వివిధ విధాలుగా చెప్పుకుంటారు.

 

 ఇక్కడ మనము ఏ రంగు వత్తులు వాడతాము ఎన్ని ఒత్తులు వాడతాము దాని ప్రకారం చేస్తే మన సమస్యలు తొలగిపోతాయి. ఉదాహరణకి ఎవరైనా మీ ఇంట్లో ఒకరు శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే మాత్రం ఎర్రని రంగు తీసుకుని మనం ఇందాక నవధాన్యాలను పోసి నల్లటి ప్రమిద పెట్టుకున్నాము. కదా దానిలో ఈ ఒత్తిని ఉంచండి దీపాన్ని వెలిగించండి తదుపరి అక్కడ కూర్చొని శివనామస్మరణ చేసుకోండి. ఆ దీపం వెలుతురు మీ మీద పడే విధంగా ప్రయత్నం చేయండి మీరు అలా కింద కూర్చుని ఎంత సమయం వరకు అయితే  చేయగలుగుతారో అంత సమయం వరకు మీరు కూర్చొని చేయండి ఇలా ప్రశాంతంగా శివనామస్మరణ చేయడం వలన మీ ఇంటిల్లిపాదికి ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి.

 

 అలాగే ఒక మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు అనుకోండి పసుపు, తెలుపు రంగు కలిగిన రెండు వత్తులను తీసుకుని ఆ ప్రమిదలో ఉంచాలి తదుపరి నువ్వుల నూనె పోసి వెలిగించాలి ఇక్కడ మీకు ఒక సందేహం రావాలి అంటే మొదట అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు ఎరుపురంగు రెండోది మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు పసుపు, తెలుపు వెలిగించాలి అంటే పసుపు మరియు ఎరుపు రంగు ఎలా వస్తాయి అని మీరు అనుకోవచ్చు. ఈ దీపం ఒత్తులు బయట దొరుకుతాయి కానీ అవి వాడకండి దానివల్ల ఫలితం కాదు మరి ఎలా అంటే మీకు ఏ రంగు వత్తులు అయితే కావాలో ఆ రంగు కాటన్ జాకెట్ ముక్కను కొనండి. వాటిని వత్తులవలే కట్ చేసుకోండి కట్ చేసిన వాటిని నువ్వుల నూనె అయినా ఆవునెయ్యిలో అయినా నాన్న పెట్టండి.  మీకు ఓపిక ఉంటే తెల్ల జిల్లేడు చెట్టు ఆకులను ఒక ఐదారు తెచ్చుకొని నానబెట్టిన ఒత్తులను  ఆకుల మీద వేసి ఎండబెట్టండి. ఒక రెండు రోజులు మొత్తము వాటిని బాగా ఎండనివ్వండి. వెలిగించాల్సిన రంగుల వత్తులను ఇలా తయారు చేసుకోవాలి.

 

 

 అలాగే వివాహానికి సంబంధించిన సమస్యతో బాధపడుతుంటే  పసుపు రంగులో గల వత్తులను మూడు వత్తులను తీసుకోండి తీసుకొని ప్రమీద లో పెట్టి దీపాన్ని వెలిగించండి. ఈ దీపం వెలిగిస్తే ఉన్నంతసేపు దీపం ముందు కూర్చుని శివ నామస్మరణ చేస్తే సమస్యలు తొలగిపోతాయి. వివాహానికి సంబంధించి కుజదోషాలు కానీ కుజ ప్రభావ రీత్యా వివాహానికి సంబంధించి ఆటంక విజ్ఞాలు ఏర్పడితే వారు గనక నీలపు రంగు గల మూడు వత్తులను తీసుకొని ప్రమిదలో పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఇలా చేస్తే కుజ ప్రభావం, కుజ దోషం కలిగినవారు వాటి నుంచి బయటపడతారు.

 

 

 విద్యకు సంబంధించి అంటే చదువుకునే విద్యార్థులకు గురించి పసుపు రంగు గల నాలుగు వత్తులను వేసి దీపాన్ని వెలిగించుకోండి ఇక్కడ గమనిక 4వత్తులను విడివిడిగా వెలిగించుకోవాలి. అంటే ఒకే ప్రమిదలో వత్తులను విడివిడిగా కలపకుండా వెలిగించాలి. ఉద్యోగపరంగా ప్రయత్నం చేసేవారు ఉంటే గంధం ఏ రంగులో అయితే ఉంటుందో ఆ రంగు గల 5 వత్తులను ప్రమిదలో వేసి దీపారాధన చేసుకోండి ఇలా చేయటం వలన ఎంతో శుభపరిణామాలు జరుగుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: